మోడలింగ్ నుండి వెండితెరకు వచ్చిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ముకుందా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఈ సినిమాలో చాలా పద్దతిగా కనిపించింది. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ లో కూడా ఆమె గ్లామర్ ప్రదర్శనకు అవకాశం రాలేదు.
అయితే ఇప్పుడు దువ్వాడ జగన్నాధంలో ఆమె గ్లామర్ విశ్వరూపం చూపించింది. దర్శకుడు హరీష్ శంకర్ హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో దిట్ట. ఈ సినిమాలో ఏకంగా పూజాతో బికినీ వేయించేశాడు. అది చూసి సెన్సార్ వాళ్లు కూడా బ్లర్లు వేసుకోవాల్సివచ్చింది. సెన్సర్ బికినీని బ్లర్ చేసినప్పటికీ థియేటర్లలో ఆడియన్స్ అదిరిపోయే విజల్స్ వేశారు పూజా గ్లామర్ షోకి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పూజా హాట్ హాట్ గా కనిపిస్తుంది. తాజగా జరిగిన థాంక్స్ మీట్ లో పూజా గ్లామరస్ లుక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అల్ట్రా మోడ్రెన్ డ్రెస్ లో అందాల హొయలు ప్రదర్శించింది పూజా. మొత్తంమ్మీద గ్లామర్ ప్రదర్శనలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని హింట్ ఇచ్చేసిందీ మోడ్రెన్ గోపికమ్మ.