అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. దిల్‌రాజు నిర్మాత. ఇటీవలే ఈ కాంబినేషన్‌కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు కథానాయిక కూడా కన్ఫామ్ అయిపోయిందని టాక్. బన్నీ పక్కన కథానాయికగా పూజా హెగ్డేని ఎంచుకొన్నారని టాక్. వరుణ్ తేజ్‌తో ముకుంద చిత్రంలో నటించింది పూజా. అంతకు ముందు నాగచైతన్యతో ఒక లైలా కోసం.. చిత్రం కోసం జత కట్టింది. ఇప్పుడు హృతిక్ రోషన్ నటించిన మొహంజదారో లో కథానాయికగా నటిస్తోంది. మొహంజదారోతో బాలీవుడ్‌లోనూ పూజా పాపులర్ అయ్యింది. మొహంజదారో కోసమే కొన్ని సినిమాల్ని త్యాగం చేసింది పూజా. మొహంజదారో ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడడంతో.. తెలుగు సినిమాలవైపు మరోసారి దృష్టి పెట్టింది. ఇటీవలే దిల్‌రాజు పూజాని కలుసుకొని.. ఓ సినిమా కోసం ఎగ్రిమెంట్ చేయించుకొన్నట్టు తెలుస్తోంది. బన్నీ సినిమాలో మరో కథానాయికకీ ఛాన్స్ ఉందని సమాచారం. ఆ పోస్టు ఎవరికి దక్కుతుందో చూడాలి.