పవన్‌కల్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘కెమరామెన్ గంగతో రాంబాబు’ గుర్తుందా? అందులో హీరోయిన్ తమన్నా కెమరామెన్‌గా కనిపించారు. పవన్ జర్నలిస్ట్‌గా కనిపిస్తే… తమన్నా వీడియో జర్నలిస్ట్‌గా కనిపించారు. ఈ లిస్టులోకి పూజా హెగ్డే త్వరలో చేరబోతున్నారని సమాచారం. అంటే… వీడియో జర్నలిస్ట్‌గా లేదా కెమెరా ముందు కెమెరాతో కనిపించే హీరోయిన్ల లిస్టులోకి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అరవింద సమేత… వీరరాఘవ’. ఇందులో అరవింద పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఫ్యామిలీ డీటెయిల్స్ పక్కన పెడితే… విదేశాల నుంచి ఇండియాకి వచ్చిన ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లేదా వీడియో జర్నలిస్ట్‌గా కనిపిస్తారట! ఆమెకు, సినిమా కథకు సంబంధం ఏంటనేది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పూజా హెగ్డే, సునీల్ కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయని తెలుస్తుంది.