మహేశ్ బాబు – త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’లో హీరోయిన్స్ గా మొదట పూజా హెగ్డే, శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే బయటకు వెళ్లింది. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. రెండో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఐతే ఇప్పుడీ సినిమాలోకి మళ్ళీ పూజా హెగ్డే వచ్చింది. ‘గుంటూరు కారం’లో ఓ ఐటెం సాంగ్ వుంది. ఈ పాటని పూజా హెగ్డే చేయడం దాదాపు ఖాయమైయింది.
ఐతే పూజాని తీసేసి మళ్ళీ ఆమెతోనే ఐటెం సాంగ్ చేయించడం ఏమిటనే సందేశం రావచ్చు. దిని వెనుక కారణం అడ్వాన్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నప్పుడు ఆమెకు ఇచ్చిన అడ్వాన్స్ తొలగించిన తర్వాత తిరిగి ఇవ్వలేదు. ఆమె దగ్గరే అడ్వాన్స్ వుండిపోయింది. త్రివిక్రమ్ తెలివిగా ఆలోచించి అడ్వాన్స్ ని బ్యాలన్స్ చేసేలా ఈ ఐటెం నెంబర్ మార్గాన్ని ఎంచుకున్నారు.
నిజానికి యూనిట్ తో పూజాకి కొన్ని అభిప్రాయబేధాలు రావడంతో తప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సినిమాలో భాగం కావాల్సివచ్చింది. పూజా కూడా తెలివిగానే అలోచించింది. ఓ రెండు రోజులు కాల్సీట్లు సర్దుకుంటే ఇంకా ఆ అడ్వాన్స్ సర్దాల్సిన అవసరం వుండదు. అందుకే యూనిట్ తో కొన్ని ఇబ్బందులు వున్నప్పటికీ ఈ ఐటమ్ సాంగ్ కి పచ్చాజెండా ఊపింది పూజా.