ఈమధ్య పూజా హెగ్డే పేరు పెద్దగా వినిపించడం లేదు. కొత్తమ్మాయిల హవా వల్ల పూజా కాస్త సైడ్ అయ్యింది. ఇప్పుడు తనకు ఓ సూపర్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. రజనీకాంత్ సినిమాలో తాను ఓ ప్రత్యేక గీతం చేయబోతున్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో ‘కూలీ’ అనే ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉంది. ఆ పాటలో పూజా హెగ్డే కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల పూజాతో.. చిత్రబృందం సంప్రదింపులు జరిపిందని, పూజా కూడా ఈ పాటలో నర్తించడానికి ఒప్పుకొందని సమాచారం అందుతోంది.
పూజా హెగ్డేకి ఐటెమ్ గీతాలు చేయడం కొత్తేం కాదు. ‘రంగస్థలం’, ‘ఎఫ్ 3’లాంటి చిత్రాల్లో ఐటెమ్ భామగా మెరిసింది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి నటించడం ఇదే తొలిసారి. కాబట్టి… తనకు ఇది మంచి అవకాశమే. పైగా ఇది లోకేష్ కనగరాజ్ సినిమా. తనపై మాస్, యాక్షన్ ప్రియులు చాలా ఆశలే పెట్టుకొంటారు. ఎన్ని విధాలుగా చూసినా పూజాకు ఇది మంచి అవకాశం. ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ‘కాంచన 4’లో లారెన్స్‌తో కలసి నటిస్తోంది పూజా. ఇది కాకుండా ఓ హిందీ సినిమా ఉంది. సూర్య ‘రెట్రో’లోనూ తనే నాయిక.