టాలీవుడ్‌లోని అగ్రశ్రేణి కథానాయికల్లో పూజా హెగ్డే పేరు కూడా ఉంటుంది. మహేష్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్హీరోలతో జట్టు కట్టి.. తాను కూడా స్టార్ అయిపోయింది. అయితే ఒక్కటే లోటు. సరైన హిట్టు లేదు. ఎడా పెడా అవకాశాలు అందుకుంటున్నా.. ఆ సినిమాలేవీ సరిగా ఆడకపోవడంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ‘అరవింద సమేత వీర రాఘవ’ విడుదలకు ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని భయపెట్టిన విషయాల్లో ‘ఐరెన్ లెగ్’ ముద్ర కూడా ఒకటి. అయితే ‘అరవింద..’ విడుదలైంది. ఈ సినిమాతో పాటు పూజా పాత్రకీ మంచి పేరొచ్చింది. ఈ హిట్‌తో ఐరెన్ లెగ్ అనే ముద్రని దాదాపుగా చెరిపివేసుకునే ప్రయత్నం చేసింది. ఈ విజయం అటు మహేష్ ఫ్యాన్స్‌కీ, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్‌కి కూడా రిలీఫ్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ‘మహర్షి’లో పూజానే కథానాయిక. ప్రభాస్ కొత్త చిత్రంలోనూ పూజానే హీరోయిన్. ‘అరవింద’ ఫలితం అటూ ఇటూ అయితే… ఆ రెండు సినిమాలపై ఆ ప్రభావం పడేదేమో. ఇప్పటికి మాత్రం రిలీఫ్ తీసుకునే ఛాన్స్ దొరికింది.