విజ‌య్‌తో.. పూజా హెగ్డే!

ఇటీవ‌లే ‘గోట్‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు విజ‌య్‌. ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఈ సినిమా త‌ర‌వాత విజ‌య్ పూర్తిగా రాజ‌కీయాలతో మ‌మేకం అవుతాడ‌ని, సినిమాలు వ‌దిలేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ‘గోట్’ దెబ్బ‌తో విజ‌య్ మ‌రో సినిమా చేశాకే, బ్రేక్ తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ని టాక్. హెచ్‌. వినోద్ చెప్పిన క‌థ‌ని విజ‌య్ ఇది వ‌ర‌కే అంగీక‌రించాడు. ఈ సినిమాని అతి త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకెళ్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చిత్రంలో క‌థానాయికగా పూజా హెగ్డేని ఎంచుకొనే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. పూజాకు విజ‌య్ తో ఇది రెండో సినిమా అవుతుంది. ఇది వ‌ర‌కు ‘బీస్ట్‌’లో జంట‌గా న‌టించారు.

పూజాకు కొంత‌కాలంగా స‌రైన అవ‌కాశాలు లేవు. విజ‌య్ తో సినిమా ఓకే అయితే, త‌న కెరీర్ మ‌ళ్లీ పుంజుకొన్న‌ట్టే అనుకోవాలి. ప్ర‌స్తుతం వినోద్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో బిజీగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి, 2024 వేస‌విలోగా విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్. విజ‌య్ ఈ సినిమాకు కేవ‌లం 60 రోజుల కాల్షీట్లే కేటాయించాడ‌ని తెలుస్తోంది. దాని ప్ర‌కార‌మే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర‌బృందం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుక్కల విద్యాసాగర్ కూడా పరారీ !

కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ పరారీ అవుతున్నారు. తాము తప్పు చేయలేదని విచారణ ఎదుర్కొంటామని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. తాజాగా ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో...

తెలంగాణ తల్లి విగ్రహం – కేటీఆర్‌ ఆన్సర్ ఏది ?

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే......

తగ్గుతున్న జగన్ భయం – ఏపీలో పెట్టుబడుల వెలుగులు !

ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్...

బెజవాడ ప్రజలకు తోడు, నీడగా ప్రభుత్వం !

బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close