డెహ్రాడూన్‌లో పూజా హెగ్డేకి స్వామికార్యం, స్వకార్యం రెండూ నెరవేరుతున్నాయి. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో జరుగుతోంది. ప్రతిరోజూ హీరోయిన్‌కి షూటింగ్ వుండదు కదా! మధ్య మధ్యలో ఒక్కో రోజు ఫ్రీ టైమ్ దొరుకుతుంది. అప్పుడు చుట్టూ వున్న టూరిస్ట్ స్పాట్స్‌ని చుట్టేస్తున్నారీ సుందరి. ఫ్రీ టైమ్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. డెహ్రాడూన్‌కి రెండు మూడు గంటల దూరంలో ఆధ్యాత్మిక నగరాలు హరిద్వార్, రిషికేశ్ వున్నాయి. రెండిటినీ ఓ రౌండ్ వేశారు పూజా హెగ్డే. రిషికేశ్‌లో రామ్ జోల, లక్ష్మణ్ జోల తదితర ప్రదేశాలను సందర్శించడంతో పాటు హరిద్వార్‌లో గంగాహారతి వీక్షించారు. ఓ పక్క షూటింగ్… మరో పక్క టూరిస్ట్ విజిటింగ్… రెండూ మిస్ చేయడం లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, దిల్ రాజు నిర్మిస్తున్న మహేష్ బాబు 25వ సినిమా డెహ్రాడూన్ షెడ్యూల్ మరో వారంలో ముగుస్తుందని తెలుస్తుంది.