ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత భీవత్సవంగా వుంది. అందం, అభినయం వున్న హీరోయిన్లు తిప్పికొడితే నలుగురు కూడా కనిపించడం లేదు. ఇక బడా హీరోలకి హీరోయిన్ సెట్ చేయడం పెద్ద టాస్క గా మారింది. ఒకప్పుడు హీరోయిన్ అంటే ఒక ఇరవై సినిమాలైనా చేసిది. కానీ ఇపుడు మూడు సినిమాల తర్వాత సినియర్ జోనర్ లోకి వెళ్ళిపోతుంది. దీంతో మళ్ళీ వేట మొదలు. ఇప్పుడు అంతా ఓ రౌండ్ హీరోయిన్సే. ఈ రౌండ్ లోనే టాప్ హీరోలందరినీ కవర్ చేసేయాలి. ఇప్పుడీ రౌండ్ లో పూజా హెగ్డే చేరింది.
‘ముకుందా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా.. డిజేతో కమర్షియల్ మెరుపులు మెరిపించింది. దీంతో ఇప్పుడు అందరి లుక్కూ పూజాపై పడింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో పూజాని ఫైనల్ చేశారు. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాలో పూజానే హీరోయిన్. ఇప్పుడు మరో బడా ఆఫర్ పూజా ఖాతాలోకి వెళ్ళింది. జిల్ ఫేం రాధకృష్ణ, ప్రభాస్ తో యువీకి క్రియేషన్ లోనే ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు ఈసినిమాలో కూడా పూజానే హీరోయినట. ఓ నేషనల్ ఛానల్ తో మాట్లాడిన పూజా ఫ్లో ఈ సినిమా గురించి చెప్పింది. ప్రభాస్ తో కూడా నటిస్తున్నానని వెల్లడించింది. సో.. పూజా కూడా టాప్ హీరోయిన్ లీగ్ లో చేరిపోయిందన్నమాట.