ఇటీవల పూనమ్ బాజ్వా వార్తల్లోకి ఎక్కింది. ఓ దర్శకుడ్ని ప్రేమించి, రహస్యంగా పెళ్లి చేసుకొందని మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. పూనమ్ పెళ్లి చేసుకోవడం ఏమిటి? అదీ రహస్యంగా అంటూ ఆశ్చర్యపోయినా, సినిమా వాళ్లకు ఇదంతా కామనే కాదా, అని ఆ తరవాత లైట్ తీసుకొన్నారు.
అయితే ఈ విషయం తెలుసుకొన్న పూనమ్ `నాకు పెళ్లవవ్వడం ఏమిటి, నాన్సెన్స్… నా సిస్టర్ పెళ్లి చేసుకొంది, అందరూ నన్ను అనుకొంటున్నారు` అంటోంది. తన సిస్టర్ కూడా తనలానే ఉంటుందట. అందుకే చాలామంది పొరపాటు పడ్డారని వాదిస్తోంది. ఇదేదో.. కవల చెల్లెళ్ల కథలా ఉంది. సినిమా స్టోరీకి బాగా పనికొచ్చేలా ఉంది.
పూనమ్ గతంలో పెద్ద హీరోలతో సినిమాలు చేసినా.. కాలం కలసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అందుకే పెళ్లి చేసుకొని స్థిరపడిపోయిందేమో అనుకొన్నారు. ఇప్పుడు పూనమ్ పెళ్లీ లేదు, గిళ్లీ లేదు.. అంటోంది. అదంతా నిజమేనా, లేదంటే.. చెల్లెలి పేరు చెప్పి విషయం కవర్ చేస్తుందా అన్న కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెల్లాయి ముందుకొచ్చి. నిజం చెబితే గానీ.. ఈ పుకారు ఆగదేమో?