మాజీ హీరోయిన్ పూనం కౌర్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. మొదట ఇన్ డైరక్ట్ గా ఆరోపణలు చేసిన ఆమె ఆ తర్వాత ఓపెన్ అయిపోయారు. ఇటీవల డాన్స్ మాస్టర్ జానీని అరెస్టు చేసిన తర్వాత సోషల్ మీడియాలో నేరుగా త్రివిక్రమ్ పై ఆరోపణలు చేశారు. ఆయన కూడా తనను వేధించారని అన్నారు. అయితే అప్పట్లో ఆమె తాను ఎవరికైనా ఫిర్యాదు చేశానో లేదో చెప్పలేదు. మళ్లీ ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేరుగా నేరుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ ను పేరును ప్రస్తావించడంతో ఆ సంఘానికి చెందిన ట్రెజరర్ శివబాలాజీ స్పందించారు. పూనమ్ కౌర్ మా అసోసియేషన్ కు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పోనీ తమ సంఘం పవర్ లోకి రాక ముందు గత అసోసియేషన్ కు ఏమైనా ఫిర్యాదు చేసిందేమో అని రికార్డులు పరిశీలించామని ఎప్పుడూ ఫిర్యాదు చేసినట్లుగా లేదన్నారు. ఫిర్యాదు చేయకుండా ఇలా సోషల్ మీడియా లో పెట్టి న్యాయం చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.
పూనంకౌర్ ఇలా సోషల్ మీడియాలో పెట్టడం కన్నా కోర్టులనో.. లేకపోతే ఇండస్ట్రీని సంఘాలకో ఫిర్యాదు చేస్తే ఓ పరిష్కారం చూపుతారని.. ఇలా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల పరిష్కారం ఎలా వస్తుందని ప్రశ్నించారు. గతంలో జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు నటి ఝాన్సీ కూడా తమ దృష్టికి పూనంకౌర్ ఫిర్యాదు రాలేదన్నారు. అయినా ఆమె ఫిర్యాదు చేయలేదు. కానీ గుర్తొచ్చినప్పుడు త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు.