పూనంకౌర్ … అప్పుడప్పుడూ ట్విట్టర్లో బాంబులేస్తూంటారు. ఆ ట్వీట్ టపాసులు ఎవరి మీద వేశారో అర్థమైనట్లు ఉంటుంది..కానీ క్లారిటీ ఉండదు. చాలా రోజులుగా ఇతే తంతు. కొద్ది రోజుల క్రితం.. ఇలాంటి ట్వీట్లు చేసి.. కాస్త వైరల్ అవుతూండగానే… డిలీట్ చేసేసేవారు. కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. తను ట్వీట్లు చేస్తున్నారు. అంతే ఉంచుతున్నారు. గురువారం రాత్రి కూడా.. ఇలాంటి ట్వీట్లు ఆమె కలకలం రేపాయి. ఆ ట్వీట్లలో ఏమన్నారంటే.. సింపుల్‌గా ” జల్సాలు చూపిస్తూ.. ఆజ్ఞాతవాసంలో ఏసేస్తాడు.. జాగ్రత్త” అంటూ.. నమ్మకద్రోహి హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. అంతలోనే ట్వీట్ వైరల్ అయిపోయింది. వేలల్లో రీట్వీట్లకెళ్లిపోయింది.
ఇంతకీ పూనంకౌర్ ఈ ట్వీట్లలో ఎవరికి నమ్మకద్రోహి బిరుదిచ్చారు..? జల్సాలు చేసి.. అజ్ఞాతవాసంలో వేసేసేది ఎవరు..? దీనిపై మాత్రం అటు పొలిటికల్ ఫ్యాన్స్..ఇటు సినీ ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చినట్లు వచ్చింది.కానీ రావడం లేదు. కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి ట్వీట్లు చేసింది. ఓ దర్శకుడిని ఉద్దేశించి చేసిన ట్వీట్లు అవి. ఇప్పుడు దర్శకుడిని ఉద్దేశించి చేసినవా..? హీరోను ఉద్దేశించి చేసినవా అన్నదానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ రావట్లేదు.
కొద్ది రోజుల కింద ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి చానల్‌కు ఇంటర్యూ ఇచ్చింది పూనంకౌర్. అందులో సిక్కు మహిళకు తనకెదురైన అన్యాయాల్ని ఎదుర్కొంటానని గట్టిగానే చెప్పింది. టాలీవుడ్లో తనకు చేదు జ్ఞాపకాలే ఉన్నాయని కూడా చెప్పుకొచ్చింది. తనను నమ్మించి మోసం చేసిన వారిని వదిలి పెట్టబోనని కూడా చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్యూలో ఆంధ్రప్రేదశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును రెండు మూడు సార్లు ప్రశంసించింది కూడా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం.. కాశీలో పూజలు చేసి… వార్తల్లోకెక్కారు. మొత్తానికి పూనం కౌర్ ట్వీట్లు, ఇంటర్యూలు చూస్తూంటే… ఆమె ఎప్పుడో ఓ సారి బ్లాస్టయ్యే అగ్నిపర్వతంలానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.