తెలుగులో పూనమ్ కౌర్ హిట్ హీరోయిన్ కాదు. కానీ, పవన్‌కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన విమర్శల్లో పూనమ్ కౌర్ పేరు హాట్ టాపిక్ & హిట్ టాపిక్ అయ్యింది. ఆమె ప్రమేయం లేకుండానే వార్తల్లో నిలిచారు. వచ్చీ రాని తెలుగులో ఈ రోజు ఫేస్బుక్లో ఆవిడ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.
“కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి… బట్టలు మార్చుకుంటూ, మనుషుల్ని మారుస్తూ…మాట మీద ఉండకుండా జానాల ఇన్నోసెన్స్‌తో ఆడుకుంటూ… వేషభాషలు మారుస్తూ… జనాల్ని మభ్యపెట్టి… అమ్మాయిల్ని అడ్డం పెట్టుకుంటూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ భగవంతుడే నిజం ఏంటో అందరికీ తెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” – పూనమ్ పోస్ట్ సారాంశమిది.
రాజకీయాలపై, రాజకీయం నాయకులపై పూనమ్ పంచ్ వేశారని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ‘జనసేన ఆవిర్భావ సభ’ పూర్తయిన మరుసటి రోజు పూనమ్ పోస్ట్ చేయడం, గతంలో పవన్-కత్తి వివాదంలో ఆమె పేరు రావడంతో ఈ పోస్ట్ ఎవరి మీద అనేది డిస్కషన్ పాయింట్.