హీరోయిన్ పూనంకౌర్ పూజులు చేసినా, ట్వీట్లు చేసినా… హాట్ టాపిక్ అవుతూనే ఉంది. గతంలో పూనంకౌర్…పవన్ – కత్తి మహేష్ వివాదంలో చేసిన ట్వీట్లు రచ్చకు కారణమయ్యాయి. వ్యక్తిగత జీవితాల వరకూ వెళ్లాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ తో డీల్ సెట్ చేసుకోవడంతో ఆ వివాదం అందటితో ముగిసింది. అయితే పూనంకౌర్ ట్వీట్లు మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. ఎవరిపేరూ నేరుగా చెప్పకపోయినా.. ఘాటు విమర్శలతో గతంలో ట్వీట్లు పెట్టారు. ఆ తర్వాత తీసేశారు. అయితే అప్పటికే అవి వైరల్ అయిపోయాయి. కొద్ది రోజుల క్రితం… ఓ తెలుగు న్యూస్ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చారు. అందులో టాలీవుడ్లో తనకు వేధింపులు ఎదురయ్యాయని.. వాటిపై పోరాడతాను కానీ.. వెనక్కి తగ్గబోనని హెచ్చరికల్లాంటి ప్రకటనులు చేశారు. దీంతో పూనం వైపు నుంచి ఎప్పుడు ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ వస్తుందోనని.. చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు.
ఆ ఇంటర్యూలో తనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు చూచాయగా చెప్పారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును రెండు, మూడు సార్లు పొగిడారు. ఆ తర్వాత ప్రత్యేకహోదా కోసం… వారణాశిలో ప్రత్యేక పూజలు చేసినట్లు …ఫోటోలు విడుదల చేశారు. ప్రస్తుతం తాను నటించిన హిందీ సినిమా త్రిదేవ్ ప్రమోషన్ ట్వీట్లు పెడుతున్నారు. ఈ మధ్యలో ఏం గుర్తొచ్చిందో కానీ… మళ్లీ ఓ దర్శకునితో తనకు ఎదురైన అనుభవాలపై ట్వీట్లు పెట్టి… సంచలనం రేపారు. ఓ దర్శకుడు తనకు అవకాశం ఇస్తానని చెప్పి నిరాశకు గురి చేశాడని… కొంత బాధాకరమైన ట్వీట్ పెట్టింది. ఆ దర్శకునితో తనకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో కానీ… వాటికి సంబంధించిన ఆధారాలేమీ తన వద్ద ఉంచుకోలేదన్నారు. కర్మ మాత్రమే అన్నింటికీ సమాధానం చెబుతుందని… వేదాంతధోరణిలో ట్వీట్లు పెట్టారు.
నిజానికి పూనంకౌర్ …విషయంలో కత్తి మహేష్ చేసిన ఆరోపణల ప్రకారం…. స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆమెకు జల్సా సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చారట. ఆ సినిమా చేస్తున్నందున ఇతర సినిమాలను పూనంకౌర్ అంగీకరించలేదట. అయితే చివరికి జల్సాలో పూనంకు అవకాశం కల్పించలేదు. దాంతో ఆమె సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారని… కత్తి మహేష్ చెప్పుకొచ్చారు. దీంట్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. పూనం కౌర్ ట్వీట్లు ఇప్పుడు నేరుగా.. దర్శకుడినే గురి పెట్టడంతో.. ఆ డైరక్టర్ ఎవరనేదానిపై టాలీవుడ్ లో చర్చ ప్రారంభమయింది.
https://twitter.com/poonamkaurlal/status/994507518003957760
https://twitter.com/poonamkaurlal/status/994508615447793666