పూనమ్ పాండే… ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా వుండే యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని పేరు. సినిమాల్లో ఈవిడగారి యాక్టింగ్ కంటే ఇంటర్నెట్లో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో చేసే ఓవర్ యాక్టింగే ఎక్కువ. ఇండియా వరల్డ్‌కప్ నెగ్గితే… స్టేడియంలో నగ్నంగా తిరుగుతానని అప్పట్లో ప్రకటించి సంచలనం సృష్టించింది. దాంతో పబ్లిసిటీ పొందింది. ఆ తరవాత తనకు వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా పబ్లిసిటీకి ఉపయోగించుకుంది. ప్రస్తుతం ఈ హాట్‌బ్యూటీ తెలుగులో ‘లేడీ గబ్బర్‌సింగ్’ అనే సినిమా చేస్తుంది. పవన్‌కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు గబ్బర్‌సింగ్ అంటే పవనే. అందులోనూ ఈ రోజు (ఆదివారం) పవన్ బర్త్‌డే. దాంతో ఈ సందర్భాన్ని వదలకుండా చక్కగా ఉపయోగించుకుంది పూనమ్ పాండే. ‘లేడీ గబ్బర్‌సింగ్’ని పవన్‌కి అంకితం ఇస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించింది. ఈ చిత్రానికి వీరు కె దర్శకుడు.