పూర్ణకి దశ తిరిగింది. అంతా మర్చిపోతున్న తరుణంలో ఈ వెటరన్ నాయికకు వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను సినిమాలో పూర్ణ ఓ నాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్లను పక్కన పెట్టి, ఆ సినిమాలో బాలయ్య పక్కన పూర్ణని ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు సునీల్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. సునీల్ కథానాయకుడిగా `వేదాంతం రాఘవయ్య` ఈరోజే పట్టాలెక్కింది. హరీష్ శంకర్ కథ అందిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ఇది.చంద్రమోహన్ దర్శకుడు. ఈ సినిమాలో కథానాయికగా పూర్ణ నటించనుందని టాక్. పండగ తరవాత.. రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. ఈలోగా కథానాయిక ఎంపికపై ఓ అధికారిక ప్రకటన వస్తుంది.