ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కుమారుడు శ్రీహర్ష కెనడాలో మృతి చెందారు.ఆయన వయసు 32 సంవత్సరాలే. ఉద్యోగం నిమిత్తం కెనడాలో ఉంటున్న ఆయనకు బోన్ క్యాన్సర్ వచ్చింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో…ఎంత ఉన్నత స్థాయి వైద్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. కొమ్మినేని శ్రీనివాసరావుకు … శ్రీహర్ష ఏకైక కుమారుడు. నాలుగేళ్ల క్రితం ఆయన కుమారుడికి ఘనంగా వివాహం కూడా జరిపించారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా కెనడాలో ఉంటుున్నారు. కుమారుడి అనారోగ్యం గురించిన తెలిసిన వెంటనే కొమ్మినేని దంపతులు కెనడా వెళ్లారు. కానీ విషాదం మాత్రం వారిని వెంటాడింది. కొమ్మినేని శ్రీనివాసరావు.. అధికార మీడియా వర్గాల్లో ఎంతో మంది సుపరిచితులు… ఆయన కు కలిగిన విషాదం పట్ల.. అందరూ బాధను వ్యక్తం చేశారు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోవడం.. ఏ తండ్రికైనా కష్టమని.. ఆయనకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. ప్రస్తుతం సాక్షి టీవీలో లైవ్ విత్ కేఎస్ఆర్ అనే టాక్ షోను కొమ్మినేని నిర్వహిస్తున్నారు. మనసులో మాట పేరుతో ఇంటర్యూలు కూడా చేస్తూంటారు.