సావిత్రి ఆడియో వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరుపై ఇప్పటికీ వాడీ వేడీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. హీరోయిన్ కనిపిస్తే ముద్దయినా పెట్టాలి – కడుపైనా చేయాలి అని ఏదో సినిమాటిక్‌గా మాట్లాడిన బాలయ్య.. ఆ తరవాత చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. సావిత్రి ఆడియో ఫంక్షన్ గురించీ, అందులో బాలయ్య మాట్లాడిన తీరు గురించీ.. జనం మర్చిపోతున్నా – మీడియా మాత్రం ఇంకా ఇంకా ఫోకస్ పెడుతూనే ఉంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ సక్కుబాయ్ (సావిత్రకి పేరడీ అన్నమాట) పేరుతో ఓ పోగ్రాం నిర్వహించింది. అందులో బాలకృష్ణ డూప్‌ని చూపించి… అతనితో నానా రకాలైన వేషాలూ వేయించారు. సావిత్రి ఆడయో ఫంక్షన్లో బాలయ్య ఎలా మాట్లాడాడో.. అచ్చంగా అలానే ఆ డూప్తోనూ డైలాగులు చెప్పించారు. చివరికి… ఊళ్లో ఉన్న మహిళా సంఘాలన్నీ బాలయ్యని గిచ్చి వెళ్లిపోతుంటాయి. ఇదీ.. ఆ పోగ్రాం సాగిన తీరు.
బాలయ్య మాట్లాడిందే టూమచ్ అనుకొంటే… ఈ పోగ్రాం సాగిన తీరు… త్రీమచ్గా మారింది. కేవలం బాలయ్య పాపులారిటీకి గండి కొట్టాలన్న ఉద్దేశంతోనే ఈ పోగ్రాం నిర్వహించారన్నది తెలుస్తూనే ఉంది. జనాలు మర్చిపోయినా.. మీడియా మాత్రం ఈ ఇష్యూ ఇంకా తిరగేస్తుందంటే… ఏమిటి అర్థం?? సదరు మీడియా సంస్థ బాలయ్యకు వ్యతిరేకం అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఇలాంటి షోల ద్వారా జనాలకు ఏం చెప్పాలనుకొన్నారో… మీడియా సంస్థలకైనా తెలుస్తుందా?? ఏమో మరి.