వైసీపీలో ఎలాంటి సామాజిక న్యాయం ఉంటుందో మరోసారి బయటపడుతోంది. వైసీపీ సోషల్ మీడియా చేసిన అరచకాలు, ప్రజాధనం దోచుకోవడం వంటివి బయటపడటంతో … సజ్జల భార్గవ నిండా మునిగిపోయారు. ఆయన దొరికకుండా.. సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త ప్లాన్ వేశారు. తన కుమారుడ్ని సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించేలా చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున యాదవ్ కు ఆ బాధ్యతలు ఇచ్చారు.
అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారితీన డబ్బు చేసుకోవడానికి అవసరం ఉన్న పోస్టులన్నీ రెడ్లకు ఇచ్చారు. సజ్జల భార్గవరెడ్డితో పాటు సోషల్ మీడియాలో నలుగురు వ్యక్తులు కోటరీగా ఏర్పడి కోట్లు మింగేశారు. ఇతరులకు చిల్లర పడేశారు. ఇదో పెద్ద స్కామని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో విచ్చలవిడి తనం వల్ల .. అనేక కేసులు కూడా పడ్డాయి. ఇప్పుడు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత… కామ్ గా ఉండే అవకాశం లేదు. దీంతో సజ్జల ఉన్న పళంగా తన కుమారుడ్ని బాధ్యతల నుంచి తప్పించేలా చూసుకున్నారు.
నాగార్జున యాదవ కు సోషల్ మీడియా బాధ్యతలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు గత తప్పులన్నింటికీ నాగార్జున యాదవ్ భరించాల్సి ఉంటుంది. ఆయనపైనే కేసులు నమోదవుతాయి. ధర్డ్ డిగ్రీలో.. ఫోర్త్ డిగ్రీలో ఆయనే భరించాల్సి ఉంటుంది. సజ్జల భార్గవను ప్రస్తుతం ఆజ్ఞాతంలోకి పంపారు రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరు. తాడేపల్లి పార్టీ ఆఫీసుకు రావడం లేదు. అయితే నాగార్జున యాదవ్ ను బలి చేసేసి మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి రెడ్డి వారసుడ్ని తెచ్చి అప్పగిస్తారని… యాదవ్ బలి పశువు అవుతారని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.