పోసాన కృష్ణమురిళి విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు ఎమోషనల్ అయ్యారు. అనారోగ్యం వల్ల తాను నవడలేకపోతున్నానని..ఏ కేసులో తనను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఇప్పటికే రెండు ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసిన న్యాయమూర్తి మార్చి 20 వరకు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ని విజయవాడ జైలుకు తరలించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి కుట్ర చేశారన్న ఆరోపణలతో పోసాని కృష్ణమురళిని మొదట రైల్వేకోడూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై అనేక కేసులు ఉండటంతో పీటీ వారెంట్లపై పోలీసులు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆయన్ని భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక విచారణ చేసిన తర్వాత వైద్య పరీక్షలు చేపట్టారు. అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టు ఎదుట హాజరుపరిచారు. జనసేన నేత శంకర్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్టు కోర్టుకు తెలిపారు.
పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30కిపైగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. దీంతో 17 ప్రాంతాల్లోకేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో విచారణలో భాగంగా ఆయా పోలీస్టేషన్ సిబ్బంది ఆయన్ని తీసుకెళ్లి విచారిస్తున్నారు. కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే నరసరావుపేటలో రిజిస్టర్ అయిన కేసులో ఆయన్ని కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.ఆయనను కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు.