‘రామ్ చరణ్- యండమూరి’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రచయిత యండమూరి మొన్నామధ్య ఓ వ్యక్తిత్వ వికాశానికి సంబధించిన మీటింగ్ లో మాట్లాడుతూ.. రామ్ చరణ్ కి దేవిశ్రీ ప్రసాద్ కి ఓ విచిత్రమైన పోలిక తెచ్చారు. ”చరణ్ దవడ బాగం బావుండదని, సురేఖ అంటే చరణ్ తల్లి ఆ విషయంలో బాధపడేదని, తర్వాత ప్లాస్టిక్ సర్జరీలు చేయించారని,అయితే దేవిశ్రీ ప్రసాద్ తన స్వశక్తితో పైకి వచ్చాడని, ఇక్కడ నీవెవరో ముఖ్యం కాని నీ తండ్రి కాదు”.. అని అర్ధం వచినట్లు ఓ ఉపన్యాసం ఇచ్చారు. యండమూరి చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఖైదీ నెంబర్ 150ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ”ఓ మూర్ఖుడు చరణ్ బాబును తక్కువ చేసి మాట్లాడాడు. వాడు వ్యక్తిత్వ వికాసం నేర్పుతాడు. ముందు వాడు నేర్చుకోవాలి” అంటూ ఘాటు విమర్శలు చేశారు నాగబాబు. దీనిపై యండమూరి కూడా తన వివరణ ఇచ్చుకున్నారు.
అయితే ఇప్పుడీ వివాదాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు రచయిత,నటుడు పోసాని కృష్ణమురళి. తాజగా ఓ ఇంటర్ వ్యూలో మాట్లాడిన పోసాని.. రామ్ చరణ్ గురించి అంత చీప్ గా మాట్లాడతాడా? అసలు వాడు మనిషా ? అంటూ యండమూరిపై విరుచుకుపడ్డారు. రామ్ చరణ్ క్యాలిబర్ గురించి వాడికి తెలుసా ? వందకోట్ల హీరో రామ్ చరణ్. అలాంటి చరణ్ ను పట్టుకొని అంత డిగ్రేడ్ చేసి మాట్లాడతాడా? అసలు చరణ్ గురించి మాట్లాడే హక్కు వాడికి ఎవడు ఇచ్చాడు. చరణ్ తో పోలిక ఎందుకు తెచ్చాడు ? వాడి తండ్రినో వాడి కొడుకునో వాడి భార్య పేరుతోనో పోల్చుకోవచ్చు కదా.? చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు .. వీళ్ళంతా సౌమ్యులు కాబట్టి సరిపోయింది. అదే నేనైతే ఏం జరిగేదో అది జరిగేది. నా బిడ్డ గురించి అంత డిగ్రేడ్ చేసి మాట్లాడితే నేను ఊరుకునే రకం కాదు”అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పోసాని. మరి పోసాని చేసిన ఈ వ్యాఖ్యలపై యండమూరి ఎలా స్పందిస్తారో..