పోసాని కృష్ణమురళికి అన్ని కేసుల్లో రిలీఫ్ లభించింది. బుధవారం అయన కర్నూలు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదోని, విజయవాడ కోర్టుల్లో తాజాగా పోసానికి బెయిల్ వచ్చింది. రాజంపేట, నరసరావుపేటలో బెయిల్ ఇప్పటికే బెయిల్ మంజూరు అయింది. మొత్తం నాలుగు కేసుల్లో పోసానికి బెయిల్ లభించింది. ఇతర కేసుల్లో BNS చట్టం కింద పోసానికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం కర్నూలు జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి.. బుధవారం జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది. వైసీపీ అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా నోరు పారేసుకుని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ చేసి.. బూతులందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో హఠాత్తుగా తాను రాజకీయాల నుంచి విరమించుకున్నానని ఇక రాజకీయాలు మాట్లాడబోనని ప్రకటించి సైలెంట్ అయిపోయారు.
కానీ ఆయనను కేసులు వెంటాడాయి. రెండు వారాల క్రితం.. రైల్వే కోడూరు పోలీసులు మొదట హైదరాబాద్ లోని మైహోంభూజాలో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై నమోదైన కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లు జారీ చేసి.. వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. ఆరోగ్యం బాగోలేదని రెండు సార్లు సర్జరీలు జరిగాయని.. రాష్ట్రమంతటా తిరగలేకపోతున్నానని ఓ సారి కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు న్యాయమూర్తికి చెప్పుకున్నారు. ఓ సారి రాజంపేట జైల్లో గుండెనొప్పి డ్రామా కూడా ఆడారు. ఇప్పుడల్లా ఆయనకు బెయిల్ లభించడం కష్టమని అనుకుంటున్న సమయంలో .. కోర్టు నుంచి రిలీఫ్ రావడంతో ఆయన ఇంటికెళ్లే అవకాశం ఉంది.