వైసీపీ నేత, మాజీ ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై అక్కడ నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ షెల్టర్ తీసుకున్న మైహోం భూజాలోనే పోసాని నివాసం ఉంటున్నారు. ఆయన ఆచూకీ తెలియడంతో రాయచోటి పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
పోసాని కృష్ణమురళి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారు. బన్నీ, నిక్కర్ మీదనే హడావుడి చేశారు. అయితే పోలీసులు మాత్రం అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసు ఇచ్చి ఆయనను తీసుకెళ్లిపోయారు. డ్రెస్ వేసుకుని రావాలని చెప్పినా వినకుండా ఆయన ఓవరాక్షన్ చేస్తూండటంతో బనిన్, బాక్సర్ మీదనే తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అరెస్టు సమయంలో ఆయన కుమారుడు కూడా ఉన్నారు.
పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ ఓ ప్రైవేటు కేసుకూడా వేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన బూతులతో విరుచుకుపడేవారు. 2019 ఎన్నికలకు ముందు అయన నారా లోకేష్ ను ఎన్ని తిట్లు తిట్టారో చెప్పాల్సిన పని లేదు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నోటికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై వారి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కూడా వదిలి పెట్టకుండా తిట్టేవారు. టీడీపీ గెలిచిన తర్వాత కూడా ఆయన మాట్లాడారు. ఏం పీక్కుంటారో పీక్కోమన్నారు.
అయితే కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యే సరికి.. ఇక తాను రాజకీయాల్లో లేనని కుటుంబం కోసం నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ ఇలా చెప్పగానే అలా వదిలేసే చాన్స్ లేదని పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇప్పుడు రాయచోటి జైల్లో జగన్ … పోసానిని పరామర్శించే అవకాశం ఉంది.