వైసీపీ అధినేత జగన్ కోసం నోరు పారేసుకుని నెల రోజుల పాటు జైలు పాలయిన పోసాని కృష్ణమురళికి ఆ పార్టీ నుంచి కనీస సపోర్టు రాలేదు. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలన్న లక్ష్యంతో అన్నట్లుగా ప్రతీదానికి లాయర్ గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపారు. ఆయన విజయవంతంగా నెల రోజుల పాటు బెయిల్ రాకుండా చేశారు. చివరికి బెయిల్ వచ్చింది. షరతుల ప్రకారం జామీనులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వైసీపీ నేతలు ఆ జామీనుల విషయంలోనూ సహకరించలేదు.
ఉదయం విడుదల కావాల్సిన ఆయన కుటుంబసభ్యులు ఎలాగోలా జామీనుల్ని చూసుకుని సాయంత్రం విడుదలయ్యేలా చూసుకున్నారు. జైలు నుంచి విడుదలైన సమయంలో ఎవరూ అక్కడ లేరు. అంబటి రాంబాబు ఆయన కారు దగ్గర చూస్తూంటే.. పోసానినే వెళ్లి దండం పెట్టి రావాల్సి వచ్చింది. ఆయనతో మళ్లీ తిట్టించాలని సాక్షి మీడియా ప్రయత్నించింది . కానీ ఆయన మూతికి గుడ్డ కట్టుకుని వెళ్లిపోయారు.
ఇప్పటికి పోసానిపై ఎన్నో కేసులు ఉన్నాయి. వేరే కేసుల్లో పీటీ వారెంట్ వేయకపోవడంతోనే ఆయన రిలీజయ్యారు. మరోసారి ఆయన అసభ్యంగా మాట్లాడితే మరోసారి అరెస్టు చేయడం ఖాయం. మాట్లాడాలని ఆయనకు వైసీపీ నుంచి ఎప్పటిలాగే స్క్రిప్టులు కూడా వస్తాయి. కానీ.. తిట్టాల్సిన అవసరం తనకు లేకపోయినా.. చివరి వరకూ తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా తిట్టినందుకు ఇప్పుడు జైలు పాలవ్వాల్సి వచ్చింది. అయినా వైసీపీ నుంచి కనీస సానుభూతి లేకపోవడం జగన్ కూడా పరామర్శించకపోవడం పోసాని లాంటి వాళ్లకు వైసీపీలో దక్కే గౌరవం ఏమిటో స్పష్టమవుతోంది. జగన్ కోసం ఇతరుల్ని తిట్టాడని.. దాడులు చేయాలనుకునేవారికి.. పోసానికి పట్టిన గతే ఓ పెద్ద గుణపాఠం.