వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏస్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవంతంగా పోసాని కృష్ణమురళిని రిమాండ్ కు తరలించేలా చేయగలిగారు. జగన్ ఆదేశించారని పోసాని కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన మీడియా ముందు చాలా గొప్పగా చెప్పారు. విజయవాడ నుంచే నల్లకోటుతో బయలుదేరిన ఆయన.. పోలీసులు పోసానిని కోర్టులో హాజరు పరిచే వరకూ అదే నల్లకోటుతో చట్టాలను..న్యాయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఆయన రాజకీయ నాయకుడి తరహాలో వాదించారు కానీ లా పాయింట్లేమీ చెప్పకపోవడంతో పోసానిని రిమాండ్ కు పంపిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దాంతో పోసానికి కడప సెంట్రల్ జైల్ లో నివాసం ఉండనున్నారు.
పోసాని కోసం జగన్ మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపినప్పుడే చాలా మంది ఇక రిమాండ్ ఖాయమనుకున్నారు. ఆయన కడపకు పోయి మీడియాతో మాట్లాడి చేసిన వ్యాఖ్యలతో పాపం పోసాని అనుకున్నారు. పొన్నవోలుకు బదులు కనీసం పోసాని తన సొంత లాయర్ ను పెట్టుకున్నా బాగుండేదని ఆయన శ్రేయోభిలాషులు అనుకుంటున్నారు. జగన్ ప్రతి కేసుకు నిరంజన్ రెడ్డి వస్తూంటారు. ఇతర సీనియర్ నేతలకూ ఆయనే లాయర్. కానీ కిందిస్థాయి నేతలకు మాత్రం పొన్నవోలును పంపిస్తూంటారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులోవాదించే తీరు కానీ.. బయట మాట్లాడే పద్దతికానీ చూస్తే ఆయన లాయర్ ఎలా అయ్యాడో చాలా మందికి అర్థం కాదు. బయటపడిపోయే కేసుల్లోఆయన న్యాయమూర్తితో వాదనలకుదిగి..బెదిరించి నిందితుల్ని జైలుకు పంపించిన ఘటనలు ఉన్నాయి. అయినా వైసీపీ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిలో ఏ చూస్తున్నారో కానీ.. ఆయననే లాయర్ గా పంపిస్తారు. తనతో పాటు కొంత మంది ముఖ్యుల విషయంలో మాత్రం ఆయనను దగ్గరకు రానివ్వడఀం లేదు.