సినిమా ఇండస్ట్రీని అందరూ ఇంత సులువుగా ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు ?. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో వాళ్లు ఇంత కంటే దారుణంగా గతంలో వ్యవహరించారు కాబట్టి. అలాంటి వారిని టాలీవుడ్ పెద్దలు కనీసం నోటి మాత్రంగా కూడా మందలించలేదు కాబట్టి.
పోసాని కృష్ణమురళి అనే వ్యక్తికి నోటికి రద్దు లేకుండా ఐదారేళ్లు చెలరేగిపోయాడు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కుటుంబాల్ని మీడియా ముందుకు లాగి అత్యంత ఘోరమైన వ్యాఖ్యల్ని చేశాడు. ఆయన హోదా రాజకీయ నాయకుడు కాదు. టాలీవుడ్ లో ప్రముఖ రైటర్, నటుడు. ఆ పేరుతోనే ఆయన రాజకీయాలు చేస్తాడు. ఆ అడ్వాంటేజ్ ను వాడుకుని.. ఇష్టం వచ్చినట్లుగ అందరి కుటుంబాలపై నిందలు వేశాడు. ఆనాడు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు అయిన పవన్ కల్యాణ్ తల్లి, పిల్లలు, భార్యపై ఘోరమైన కామెంట్లు చేస్తే… ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఎందుకంటే అవన్నీ జగన్ రెడ్డి తిట్టించారని.. వారికి తెలుసు.
జగన్ రెడ్డి తిట్టమంటే పోసాని తిట్టేస్తారా ? దానికి టాలీవుడ్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. ఆ రోజున ఇలా పోసానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి.. ఉంటే అసలు ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తున్నామని ప్రకటన చేసి ఉంటే… ఈ రోజు ఇండస్ట్రీలోని వ్యక్తులపై ఇలా బయట వారు మాట్లాడే ధైర్యం చేసేవారా ?. ఒకరు మనపై నిందలేశారని..అంటే మనం అలుసు ఇచ్చినట్లే. పోసాని వంటి వాళ్ల వల్ల ఆ అలుసు టాలీవుడ్ పై ఇతరులకు వచ్చింది. ఇప్పటికైనా పోసాని లాంటి వాళ్లకు తగిన శిక్ష విధిస్తే.. గౌరవంగా ఉంటుంది.