నంది అవార్డులకు కమ్మకులం అంటించేశారు పోసాని కృష్ణమురళి. ఎందుకంటే ఆయనకు నంది అవార్డు ఇచ్చారట. టెంపర్ సినిమాలో నటించినందుకు ఆయనకు అవార్డు చ్చినందుకు కమ్మ కాబట్టే ఇచ్చారని ఆయన ఫిక్సయ్యారు. *ఈ అంశంపై గతంలోనే ఎంత రచ్చచేయాలో చేసారు. గత ప్రభుత్వంపై కులం ముద్ర వేయడంలో పోసాని జగన్ కు కావాల్సినంత సాయం చేశారు. అదే సాయం మళ్లీ చేయాలనుకున్నారేమో కానీ మళ్లీ రంగంలోకి దిగారు.
ఎఫ్ డీసీ చైర్మన్ గా ఉన్న పోసాని.. ఏపీఎస్ఎఫ్ఎల్ ఛానెల్ కు పోసాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వ చానల్. ఇది ఓటీటీ లాంటిదట. అంటే రిలీజైన సినిమాలను పేమెంట్ పద్దతిలో ఈ ఫ్లాట్ ఫాంపై ప్రదర్సించుకోవచ్చట. దీన్ని లాంచ్ చేయడానికి హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి.. నంది అవార్డులకు కులం అంటగడుతూ మాట్లాడారు. అప్పట్లో ఓ సారి నంది అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు కానీ ఇవ్వలేదు. తనకు టెంపర్ మూవీకి నంది అవార్డు వచ్చిందని.. తప్పదు అన్నట్టుగా ఇచ్చారన్నారు. కానీ, నేను నంది ని తిరస్కరించాను. నాకు అది కమ్మ అవార్డు లాగా అనిపించింది. అందుకే దాన్ని తిరిగిచ్చేశానని ప్రకటించారు. నంది అవార్డుల అంశంలో సీఎంతో నే చర్చించి నిర్ణయం తీసుకుంటామని కృష్ణమురళీ చెప్పుకొచ్చారు.
ఆ వివాదం కారణంగా ప్రభుత్వాలు సినిమా వాళ్లకు అవార్డులు ఇవ్వాలన్న విషయాన్ని కూడా వదిలేశాయి. గత టీడీపీ ప్రభుత్వం సినిమా వాళ్లతోనే అల్లు అరవింద్, జీవితలు చైర్మన్లుగా వేర్వేరు సంవత్సరాలకు కమిటీలు వేసి అవార్డులు ఇస్తే వాటికి కులం పూశాడు పోసాని. దాంతో ఆ అవార్డుల వేడుక ప్రభుత్వంచేయలేదు. ఈ ప్రభుత్వం ఇవ్వలేదు .తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వానికీ సినిమాలకు అవార్జులివ్వాలన్న లేదు. చేసిన నష్టం అంతా టాలీవుడ్ కే అనితెలిసినా ఆ చెట్టు కింద ఎదిగిన పోసాని…చిన్న చిన్నరాజకీయ పదవుల కోసం ఎప్పటికప్పుడు దిగజారిపోతూనే ఉన్నారు.