ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని వాడుకోవాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అది జగన్ కు ఏమాత్రం సానుభూతి తెచ్చిపెట్టకపోగా సానుభూతి కోసమే బ్యాండేజ్ కట్టు విప్పడం లేదన్న చర్చ జరిగింది.
బుధవారం మీడియా ముంగిటకు వచ్చిన ఏపీఎఫ్ డీఎస్ చైర్మన్ పోసాని కృష్ణమురళి జగన్ హత్యకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించడం చర్చనీయాంశం అవుతోంది. జగన్ ను చంపేస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారని…చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మోడీ, అమిత్ షాలకు వినపడలేదా అని ప్రశ్నించారు.
ఫేక్ వీడియోలకు ఉన్న విలువ ఏపీ సీఎం ప్రాణాలకు లేదా..? అని పోసాని ప్రశ్నించారు. జగన్ ను చంద్రబాబు హత్య చేసేందుకు కుట్ర చేస్తుంటే ఏపీ సర్కార్ ఎం చేస్తోందని…అంటే ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో వైసీపీ సర్కార్ విఫలం అయిందా..? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
పోసాని ఆరోపించినట్లుగానే చందబాబు హత్య రాజకీయాలకు ప్రయత్నిస్తే జగన్ రెడ్డి వదిలిపెట్టేవారా, పోసాని తాజా పొలిటికల్ అలిగేషన్స్ వైసీపీనే వేలెత్తి చూపేలా ఉన్నాయని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో శాంతి భద్రతలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోన్న సమయంలో సీఎం హత్యకు కుట్ర జరుగుతుందంటూ పోసాని ఆరోపించడమంటే ఏపీ ఇంటలిజెన్స్ వైఫల్యాన్ని బయటపెట్టడమేనని అంటున్నారు.
జగన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి పసలేని ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హత్య రాజకీయాల పేరిట జగన్ కు సానుభూతి పెంచేందుకు పోసాని ఎంత ప్రయత్నించినా జనాలు విశ్వసించే పరిస్థితి లేదని ఆయన ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.