రాజంపేట సబ్ జైల్లో ఉన్నప్పుడు మెడనొప్పి.. గుండె నొప్పి అని హంగామా చేసిన పోసాని కృష్ణమురళి కోర్టుల్లోనూ అలాంటి డ్రామాలే పండిస్తున్నారు. పీటీ వారెంట్‌పై పోసాని కృష్ణమురళి ని సీఐడీ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. తెలుగుయువత నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదు పై నమోదైన కేసులో కోర్టులో హాజరు పరిచారు. జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్న పోసాని కృష్ణ మురళి .. డ్రామా పండించాడు. తప్పు చేస్తే నరికేయండని ..తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ రెండు ఆపరేషన్లు, స్టంట్ లు వేశారని చెప్పుకొచ్చాడు. తనపై వ్యక్తిగత కోపం తోనే బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడని ఏడ్చారు.
రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని న్యాయమూర్తిని బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా ఆయనకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. పోసాని కృష్ణమురళికి వాస్తవంగా అయితే ఇతర కేసుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ రాని కేసుల్లో నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన బుధవారం విడుదల అవుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీఐడీ కేసులో పోలీసులు పీటీ వారెంట్ పై తీసుకొచ్చి గుంటూరులో రిమాండ్ కు తరలించారు.
పోసాని కృష్ణమురళి తాను ఇంకా తప్పు చేయలేదని అనుకుంటున్నారో లేకపోతే.. న్యాయవ్యవస్థను కూడా తన నటనతో ఎలాగోలా మేనేజ్ చేయవచ్చని అనుకున్నారో కానీ ఎప్పుడు కోర్టులో హాజరు పరిచినా డ్రామాలు మాత్రం మానడం లేదు. ఇతరుల మీదు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు ఆయనకు అనారోగ్యం గుర్తురాలేదు.. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని చుట్టంగా చేసుకుని చేసిన అరాచకం గుర్తు రాలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.