ఒకరు రైతుల్ని తిట్టడం.. మరొకరరు.. ఆ ఒకర్ని తిట్టడం.. అన్న కాన్సెప్ట్ రాజకీయాన్ని వైసీపీ స్టార్ట్ చేసిందని… ఫృధ్వీపై పోసాని ఫైరయిన తర్వాత అందరూ అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. పోసానికి.. ఫృధ్వీ కౌంటర్ ఇచ్చారు. తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని.. పోసానికి నొప్పేంటని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పను… పార్టీ స్టాండ్ ప్రకారమే మాట్లాడా…ఎవరో విమర్శిస్తే తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని తేల్చేశారు. పోసానికి దమ్ముంటే ఏదైనా వేదికపైకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. అంటే.. పోసాని, ఫృధ్వీ పకడ్బందీగా… దీన్నో ఇష్యూ చేసుకుని.. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. చర్చ పెట్టేసుకుని మీడియాలో ఎంతో కొంత స్పేస్ లాగేస్తే.. ఉద్యమానికి కాస్త కవరేజీ తగ్గించవచ్చన్న ఆలోచన.. వైసీపీ వ్యూహకర్తల్లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
రాజకీయాల్లో చిన్నా పెద్దా.. వ్యక్తిత్వం, సంస్కారం అనేదానికి అసలు చాన్సే లేకుండా వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తూంటారు. వాటిని వారు విమర్శలుగా భావిస్తూంటారేమో కానీ.. అవి బండ బూతులు. ఎదుటి పార్టీ నేతలను.. లేదా వారి మద్దతుదారులను.. మానసికంగా హింసించేందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ.. ఆ పార్టీ నేతలు కానీ .. మొదటగా ప్రయోగించేది.. ఈ బూతుల అస్త్రాన్నే. దానికి పోసాని కూడా.. ఎన్నికల సమయం తన వంతు సాయం చేశారు. ఫృధ్వీ కూడా.. అంతే. ఇప్పుడు.. సమస్యను డైవర్ట్ చేయడానికి పోసానిని.. వైసీపీ మరోలా వాడుకునే స్కెచ్ వేసింది. ఫృధ్వీ కూడా రెడీ పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సినిమా వాళ్ల గోలంటే… నెటిజన్లు.. సినిమా అభిమానులు, సామాన్య ప్రజలు కూడా కాస్త ఆసక్తి ప్రదర్శిస్తారు. ఆ క్రమంలో వైసీపీ… నోరు ఎక్కువ ఉన్న ఈ ఇద్దరు కమెడియన్లను రగంలోకి దింపినట్లుగా భావిస్తున్నారు. మొదటగా.. ఫృధ్వీ మాట్లాడిన నాలుగైదు రోజుల తర్వాత పోసాని తెరపైకి వచ్చారు. పోసాని మాట్లాడిన రెండు రోజుల తర్వాత ఫృధ్వీ కౌంటర్ ఇచ్చారు. పరిస్థితిని బట్టి.. పోసాని మరిన్ని దారుణమైన వ్యాఖ్యలతో తెరపైకి వస్తారు. ఆ తర్వాత ఫృధ్వీ.. మీడియా అటెన్షన్‌ను బట్టి ఇద్దరూ.. రెచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.