దేవాకట్టా-సాయి తేజ్ ల రిపబ్లిక్ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమా ప్రిమియర్, స్పెషల్ షోలు చూశాను. హీరో నాని రిపబ్లిక్ ఎక్స్ పీరియన్స్ ని ట్విట్టర్ లో షేర్ చేశారు. రిపబ్లిక్ చూశా. సాయి కోసం అభిమానుల ప్రార్ధనలు రిపబ్లిక్ రూపంలో కూడా ఫలిచించాయి. దేవాకట్టా చెప్పినట్లు ‘సాయి తేజ్ ఈజ్ బ్యాక్’. టీం అందరికీ కంగ్రాట్స్” అని ట్వీట్ చేశారు నాని.
సింగర్ స్మిత కూడా రిపబ్లిక్ పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రిపబ్లిక్ దేవా కట్టా గారి కొత్త ప్రస్థానం. సినిమా అద్భుతంగా వుంది. సాయి తేజ్ కి ది బెస్ట్. రాజకీయాలకు అతీతంగా అందరూ చూడాల్సిన సినిమా. మీ అందరీ రెస్పాన్స్ కోసం ఎదురు చుస్తున్ననాను” అని పోస్ట్ చేశారు స్మిత. ఇక సినిమా చూసిన మిగతా వారు కూడా సోషల్ మీడియా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని రాసుకొచ్చారు. రేపు సినిమా థియేటర్ లోకి వస్తుంది.