ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయంలో ముందు ఉంది. ఒకే ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి ప్రాంతాలు కూడా చూడటం లేదు. ఉన్నతాధికార పోస్టుల నుంచి… వీసీల వరకూ.. పేరు చివర రెడ్డి అని ఉంటే మాత్రమే ప్రాధాన్య పోస్టులు లభిస్తున్నాయి. అలాంటి వారు దేశంలో ఎక్కడున్నా.. దుర్భిణి వేసుకుని మరీ వెదుక్కుని తీసుకొచ్చి పోస్టులు ఇస్తున్నారు. వారు రిటైరైనా.. తీసుకొచ్చి అందలం ఎక్కిస్తున్నారు. ఇతర సర్వీస్లులో ఉండి.. ఏపీ ప్రభుత్వంలో పని చేయడానికి వచ్చిన “సామాజిక ప్రముఖులు” పెద్ద సంఖ్యలో ఉండగా.. తాజాగా ఏసీబీ డైరక్టర్‌గా మల్లారెడ్డి అనే తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌కు పోస్టింగ్ ఇచ్చారు.
ఏసీపీ డైరక్టర్ పోస్ట్ సాధారణంగా సర్వీసులో ఉన్న అధికారికే ఇస్తారు. కానీ.. ప్రభుత్వం ఏసీబీతో విన్యాసాలు చేయిస్తోంది. చట్టాలకు అందని రీతిలో ఇష్టం లేని వారిపై కేసులు పెట్టిస్తోంది. చివరికి రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారిపైనా.. అంతే దూకుడుగా ఉంటుంది. ఇది ముందు ముందు ఆయా ఏసీబీ అధికారులుక పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ పేరుతో అధికారులు వ్యవహరించిన తీరు వల్ల.. ఆయా అధికారులంతా.. ఇబ్బందుల్లో పడ్డారన్న అభిప్రాయం ఇప్పటికే ఉంది. అలాగే.. రాజధాని భూములుసహా ఇతర విషయాల్లోనూ కేవలం.,. ప్రతిపక్ష నేతలను ఇబ్బందిపెట్టాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు.. చట్టాలకు సంబంధం లేని కేసులు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీటన్నింటినీ డిల్ చేయడానికి ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఐపీఎస్‌లు ఎవరూ.. సిద్ధపడకపోవడంతో రిటైర్డ్ అధికారినీ అదీ.. తెలంగాణ నుంచి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.
ఐపీఎస్ గా ఉన్నప్పుడు మల్లారెడ్డి వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. తెలంగాణలోనూ ఆయన ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగానే ఉన్నారు. అందుకే రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు ఓ పదవి వచ్చింది. కొన్నాళ్ల క్రితం ఆ పదవీ కాలం కూడా ముగియడంతో ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు… ఏపీలో ఏసీబీ డైరక్టర్ పదవి వెదుక్కుంటూ వచ్చింది. ఆయన ఏసీబీ డైరక్టర్‌గా ప్రభుత్వ లక్ష్యాలను చేధించడానికి ప్రయత్నించవచ్చు. మొత్తానికి సామాజిక న్యాయం విషయంలో ఏపీ సర్కార్‌కు.. వైసీపీకి తిరుగులేకుండా పోయిందన్న అభిప్రాయాలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.