ఏపీలో భూముల విలువ పెంపును వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. జనవరి ఒకటి నుంచి కొత్త విలువల్ని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యమంత్రి ఆమోదం లభించలేదు. మరోసారి సమావేశం నిర్వహించాల్సి ఉంది.
సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో రెండు రకాల ధరలు ఉంటాయి. ఒకటి మార్కెట్ రేటు, రెండు రిజిస్ట్రేషన్ రేటు. మార్కెట్ రేటు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఎక్కువగా పెరుగుతుంది. అయితే రిజిస్ట్రేషన్ రేటు మాత్రం ప్రభుత్వం మార్చే వరకూ స్థిరంగాఉంటుంది. ఓ ఏరియాలో చదరపు గజం ఐదువేరుగా నిర్దారిస్తే మార్కెట్ రేటు యాభై వేలు ఉన్నా.. ఐదు వేలు ప్రకారమే లెక్కగట్టి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తారు. ఇలా అసలు విలువ, రిజిస్ట్రేషన్ విలువ మధ్య తేడా పెరిగిపోవడంతో సవరించాలని అధికారులు నిర్ణయించారు.
ఇలా భూముల విలువను పెంచితే ఆ భూముల విలువ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. చాలా వరకూ బ్యాంకులు భూముల విషయంలో రిజిస్ట్రేషన్ వాల్యూను చూసే లోన్లు ఇస్తాయి. ఇలాంటి వాటికి భూముల విలువ పెంపు ఉపయోగపడుతుంది. పట్టణాల్లో గజం లక్ష దాటిపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలా చోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ ఇంకా నలభై, యాభై వేలే ఉంటోంది. ఇలాంటి వాటిని సవరించనున్నారు.
అలాగే బిల్డర్లు నిర్మించే అపార్టుమెంట్ల విషయంలోనూ Sftకి వారు అమ్మే రేటుకు …. రిజిస్ట్రేషన్ చేసుకునే రేటుకు పొంతన ఉండటం లేదు. ఇప్పటికి వాయిదా పడినా మరో నెల తర్వాత అయినా భూముల విలువలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.