పవన్ కల్యాణ్ రాజకీయంతో వైసీపీకి దిక్కు తోచని పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై కసి తీర్చుకోవడానికి వ్యక్తిగత దూషణలు.. రూమర్స్ ప్రచారం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని ప్రతీ రోజూ రంగంలోకి తెస్తున్నారు. గతంలో పోసాని ఉండేవారు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే కొత్తగా పోతిన మహేష్ అనే ఆర్టిస్టును దింపారు. నిన్నటి వరకూ తాను పవన్ నీడలో పెరిగానన్న విషయాన్ని మర్చిపోయి ఆయన పవన్ పై విషం చిమ్ముతున్నారు. ఆయనకు ఎన్ని కోట్లు ఇచ్చారో విజయవాడ అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. వైసీపీకి వచ్చే లాభమేంటో కానీ.. వైసీపీ తీరుపై మాత్రం ప్రజల్లో అసహ్యం పెరిగిపతోంది. పోసాని కృష్ణమురళి ని, పోతిన మహేష్ ను ఎన్ని సార్లు మీడియా ముందుకు తీసుకు వస్తే.. పవన్ ఫ్యాన్స్.. జనసేన అభిమాన ఓటర్లతో పాటు.. తటస్తుల్లోనూ వైసీపీపై అంత కంటే ఎక్కువ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. వైసీపీపై వారంతా ఇంకా కసి పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూండటంతో పవన్ గట్టిగానే రియాక్టవుతున్నారు.
పోతిన, పోసానిలపై ఆధారపడిన వైసీపీని చూసి ఆ పార్టీకి పిచ్చి పట్టిందా.. ఆ రాజకీయం ఏమిటన్న చర్చ సామాన్యుల్లో వస్తోంది. ఎవరైనా పాలసీల గురించి మాట్లాడతారు. కానీ పెళ్లిళ్ల గురిచి మాట్లాడతారు.. వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు.. కుటుంబ విషయాల మాట్లాడతారు.. వాటిని చూసి ప్రజలు ఓట్లు వేయాలో వద్దో నిర్ణయం తీసుకుంటారా ?. వైసీపీ నేతల్లోనూ ఇదే సందేహం ఉంది. కానీ పెద్దల రాజకీయ వ్యూహాలు పిచ్చిగానే ఉండటంతో వారు కూడా పెదవి విరవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.