విజయవాడ పశ్చిమ జనసేన నేత పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పొత్తులో భాగంగా పశ్చిమ సీటు జనసేనకు వస్తుదని తాను పోటీ చేయాలని ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సీటు జనసేనకు రాలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. పవన్ కల్యాణ్ పిలిచి బుజ్జగించారు. ఇదే కాదని ముందు ముందు చాలా అవకాశాలు ఉంటాయని చెప్పారు.
అయినా బీజేపీకి మద్దతుగా ప్రచారంలోకి వెళ్లని పోతిన మహేష్ హఠాత్తుగా జనసేనకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికే సన్నాహాలు చేసుకుటున్నారని.. వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిందని అంటున్నారు. పశ్చిమ సీటు బీజేపీకి వెళ్లింది. అక్కడ సుజనా పోటీ చేస్తున్నారు. అంతుక ముదే ముస్లిం అభ్యర్థిని జగన్ ప్రకటించారు. ఇప్పుడు అక్కడ హిందూ, ముస్లిం ప్రకారం ఓటింగ్ జరిగితే ఘోర పరాజయం ఎదురవుతుందని అనుకుంటున్నారు.
అందుకే వ్యూహం మార్చి.. జనసేనలో అన్యాయ అయిందని ప్రచారం చేసుకుంటున్న పోతిన మహేష్ మహేష్ కు సీటిస్తే గట్టిపీ ఉంటుందన్న అంచనాకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పోతిన మహేష్ వెల్లంపల్లిపై పోరాడారు. అయితే వెల్లంపల్లి నియోజకకవర్గం మారారు.