ఐటి టూరిజం ఫార్మా తదితర అనేక హబ్‌లు కారిడార్ట పేరిట ఊరించిన తెలుగుదేశం ప్రభుత్వం చివరకు రాష్ట్రాన్ని ప్రళయ భీకరమైన అణుశక్తి అడ్డాగా మార్చివేయడం విచిత్రమంటున్నారు పరిశీలకులు. దేశంలోనే న్యూక్టియర్ హబ్‌గా ఎపి మారబోతున్నట్టు అదికారికంగా ప్రకటిస్తున్నారు. విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సల్మాన్ హైదర్ కోడలు, సుబ్రహ్మణ్యస్వామి కూతురు అయిన సుహాసనీ హైదర్ హిందూ పత్రిక మొదటి పేజీలో ఈ వార్త ప్రముఖంగా రాశారు. ఆమె హిందూలో విదేశాంగ వ్యవహారాల ఇన్ఛార్జిగా వున్నారు. పైగా ఎక్కడెక్కడ తిరస్కరించిన రియాక్టర్లు మనం వెంటబడి మరీతెచ్చుకుంటున్నాం. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో మితి వర్ధిలో నెలకొల్పదలచిన వెస్టింగ్టన్ హౌస్ అణు విద్యుత్ ప్రాజెక్టు(ఎన్‌పిపి)ను ఉత్తరాంధ్రలోని కొవ్వాడకు తరలించడం మొదలైంది. అక్కడే గాక తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇలా ఎక్కడికక్కడ ప్రజలప్రభుత్వాల వ్యతిరేకత కారణంగా చుక్కెదురైన అణు కర్మాగారాలన్నిటినీ ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎర్రతివాచీ పరిచింది. రష్యా నుంచి అమెరికా వరకూ కొన్ని అగ్రదేశాల నుంచి వచ్చే అణు విద్యుత్ పరికరాల వల్ల మొత్తం 63 వేల మెగావాట్లఉత్పత్తి జరుగుతుందంటే ఇందులో సగం అంటే 30 వేల మెగావాట్ల వరకూ ఎపిలోనే రాబోతున్నాయి. గతంలో చెర్నొబిల్ ఇటీవల పుకషిమా అణు కేంద్రాల ప్రమాదాల తర్వాత ప్రపంచం ఈ విషయమై చాలా ఆందోళన చెందుతున్నది. అందుకే తోషిబా వెస్టింగ్టన్ హౌస్ లకు గుజరాత్లో ప్రతికూలత ఎదురైంది. అయితే వాటిని కోరి కొవ్వాడలో పెట్టేందుకు అనుమతి లభించింది. 1100 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు రియాక్టర్లను స్తాపించడానికి 700 ఎకరాల పైగా భూమి సేకరించినా రానున్న ఎన్నికల రీత్యా మోడీ నాయకత్వం వెనకంజ వేసింది. ఇదేగాక ఇప్పటికే అక్కడ ఈ వ్యాపారంలో వున్న అదానీ టాటా ఎస్సాఆర్ వంటి కంపెనీలు కూడా ఇందుకు వ్యతిరేకత ప్రకటించాయి. గుజరాత్లో ప్రైవేటు విద్యుత్ వినియోగం అత్యధికం అనేది తెలిసిందే. ఇక రష్యన్లు సరఫరా చేసే వెవెర్ రియాక్టర్లు ఆరు బెంగాల్‌లోని హరిపూర్‌లో నెలకొల్పాలన్న ఆలోచన అమలు కాక ఎపికి మరల్చారు. పరిహారం బాధ్యత మాది కాదని విదేశీ కంపెనీలు ముందస్తు షరతు పెట్టి ఆమోదింపచేసుకున్నాయి. కనుక రెండు జిల్లాలకు ఒకటి చొప్పున ఈ అణుకుంపటి తెచ్చిపెట్టుకోవడం ఆలోచనా రహితమైన ఆరాటమే గాక ఆందోళనకరమైన నిర్ణయం కూడా.దీనికి మూల్యం చెల్లించవలసి వస్తే ఆ వూహే మహాభయంకరం. అవన్నీ పాలక పక్షం కొట్టిపారేయవచ్చు గాని గోదావరి పుష్కరాల తొక్కిసలాటనే ఆపలేని వాళ్లం అసలు విరుగుడే లేని అణు ప్రళయాలు ఆపగలమా? రష్యా జపాన్ లమెరికాలే ఘోరంగా విపలమైన రంగం అది!