అదనపు బొగ్గు కావాలంటూ.. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్… దరఖాస్తు పెట్టుకుంది. కానీ కేంద్రం నుంచి స్పందన రావడం లేదు. కారణం.. పీపీఏలను నిలిపివేసి.. ఉన్న బొగ్గును ముందుగానే కరెంట్ ఉత్పత్తికి ఉపయోగించేసి.. కొత్తగా… అదనపు బొగ్గ అడగడమేమిటన్న వాదన… కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తితో ఉన్న పర్యావరణ, వ్యయ ఇబ్బందుల కారణంగా… సోలార్, విండ్ పవర్ ను ప్రభుత్వం ప్రోత్సహించింది. దీంతో ఏపీ సర్కార్ కు.. కరెంట్ చింతలు తీరిపోయాయి. అయితే ఇది నాలుగు నెలల కిందటి వరకే. ఇప్పుడు ఏపీ సర్కార్ కరెంట్ గండాన్ని ఎదుర్కొంటోంది. గ్రామాల్లో ఆరు గంటలకుపైగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. బొగ్గు కొరత వల్లే సమస్య వచ్చిందని పొరుగు రాష్ట్రాలు కేంద్రంతో మాట్లాడుతున్నామని బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.
నిజానికి ఏపీ సర్కార్ కు కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉంది. కావాల్సినత బొగ్గు కూడా.. కొద్ది రోజుల వరకూ అందుబాటులో ఉంది. అయితే.. ఏపీ సర్కార్.. పవన్, సౌర విద్యుత్ కొనకూడదని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ్నుంచే అసలు సమస్య వచ్చింది. ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ను.. కొనడం ఆపేయడం, వాటికి సంబంధించిన కనెక్షన్లు తీసేశారు. దాంతో.. ఉన్న బొగ్గును… ధర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ఉపయోగించుకున్నారు. దాంతో రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ఇలా అవుతుందని తెలిసినా… పరిస్థితిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదన్న విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి.
ఇప్పుడు… బొగ్గు కావాలంటూ.. పొరుగు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని అడుగుతున్నట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.. విద్యుత్ కంపెనీలకు డబ్బులు చెల్లించకపోవడంతో… ఏపీకి విద్యుత్ ఇచ్చేందుకు ఎక్సేంజీలలో కరెంట్ అమ్మకానికి పెట్టిన కంపెనీలు ఆసక్తి చూపించలేదు. దీంతో.. ఎక్సేంజీ నుంచి కరెంట్ దొరకడం లేదు. ఈ పరిస్థితి అర్థమయింది కాబట్టే.. మరో వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని… అధికారులు, ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు. మా మాట విననప్పుడు.. మేమెందుకు మాట సాయం చేయాలన్నట్లుగా.. కేంద్రం ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో హైడల్ విద్యుత్ అందుబాటులో ఉంది. వరదలు తగ్గిపోతే.. ఆ విద్యుత్ లభ్యత ఆగిపోతుంది. అప్పుడు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.