సౌత్ లో సూపర్ స్టార్స్ ఎంతమంది ఉన్న పవర్ స్టార్ ఒక్కడే ఆయనే పవన్ కళ్యాన్.. హిట్ వచ్చిందని ఎగిరి పడటం.. ఫ్లాప్ వచ్చిందని కృంగిపోవడం తెలియని పవర్ స్టార్ టాలీవుడ్ క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా పేరు సంపాధించాడు. తన మార్క్ స్టైలిష్ యాక్షన్ తో అభిమానులను అలరిస్తూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మొదటిసారి ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సిని క్రిటిక్ అనుపమా చోప్రా చేసిన ఈ ముఖాముఖి తెలుగు360 పాఠకుల కోసం..
ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో ఉన్న నేను ద వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
థాంక్స్ పవన్ మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సహకరించినందుకు..
పవన్ కళ్యాణ్ : హా.. ఫైన్..
అనుపమ : మీరు సిగ్గు పడుతున్నారా
పవన్ కళ్యాణ్ : లేదు అలాంటిదేమి లేదు
అనుపమ : మీరు ఎంజాయ్ చేయట్లేదా..
పవన్ కళ్యాణ్ : అలా అనేం లేదు నేను నా పని చేసుకుంటూ పోతున్నాను.. ఇంతకుమించి ఏం లేదు చెప్పడానికి
అనుపమ : నేను నా ముందు కూర్చున్న మీ గురించి ఓ ఇంట్రడక్షన్ ఇవ్వదలచుకున్నాను.. 2016 లో సినిమాల్లో 20వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న పవన్ కళ్యాన్ కేవలం రెండు దశాబ్ధాలలో కేవలం 20 సినిమాలే తీశారు. అంతకుమించి లేదు..
పవన్ కళ్యాణ్ : అంటే మీ అర్ధం అది తక్కువనా..(నవ్వుతూ)
అనుపమ : హా.. మనం ఈరోజు మొత్తం పవన్ తో ఉంటాము ఆయన రికార్డులు.. ఆయన బాక్సాఫీస్ ని షేక్ చేసిన సందర్భాలు.. మీకు గుర్తు చేసే ముందు తన పవర్ ఫుల్ డైలాగులను షేర్ చేసుకుందాం.
అనుపమ : మీరు నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటారా..
పవన్ కళ్యాణ్ : లేదు అలా ఏం లేదు.. నేను యాక్సిడెంటల్ గా యాక్టర్ ను అయ్యాను..
అనుపమ : నాకు తెలుసు మీకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమని..
పవన్ కళ్యాణ్ : అవును నాకు గార్డెనింగ్, ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం.. ఇప్పటికి వాటిని చేస్తున్నాను..
అనుపమ : నాకు తెలిసి మీరు యాక్సిడెంటల్ గా యాక్టర్ అవలేదు. మీ కెరియర్ మొదట్లోనే మీరు పవర్ స్టార్ గా క్రేజ్ ను సంపాదించారు.. అంతేకాదు మీలో సింగర్, రైటర్, డైరక్టర్ కూడా ఉన్నారు కదా..
పవన్ కళ్యాణ్ : అదేదో అనుకుని చేసింది కాదు.. సమయానుసారంగా అవసరాన్ని బట్టి అలా కుదిరింది.. కొంతమంది ఏదైనా విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంటే దానికి నా దగ్గరున్న సలహా ఇస్తాను అది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది.
అనుపమ : మీరు సాంగ్ చాలా సింపుల్ గా పాడేస్తారు
పవన్ కళ్యాణ్ : కనపడటానికి సింపుల్ గానే ఉంటుంది (నవ్వుతూ).. కాని దాని వెనుక చాలా జరుగుతాయి.. ఫైనల్ అవుట్ పుట్ సింపుల్ గా అనిపిస్తుంది.
అనుపమ :మీరు ఎప్పుడు అభిమానుల కోసం సినిమాలు చేస్తారు.. కేవలం మంచి సినిమాలు చేస్తూ మంచి పర్సన్ గా ఉంటారు ఎలా సాధ్యం..?
పవన్ కళ్యాణ్ : హా..హా.హా లోకంలో పూర్తిగా చెడు అన్నది ఏది లేదు.. అలాగని మంచి లేదు.. నేను అంత మంచి నటుడిని ఏం కాదు.. నాకు తోచిన సినిమాలు చేసుకుంటూ పోతున్నా… ఒక పాత్రలోని నుండి మరో పాత్రలోకి అంత తొందరగా ఇన్వాల్వ్ అవ్వలేను.. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటా..
అనుపమ : స్టీఫెన్ స్పీల్ బర్గ్ ఇంటర్వ్యూలో.. ఎవరు తనకు నో చెప్పరని అది తనకు ప్రాబ్లెం అవుతుందని అన్నారు.. ఎందుకంటే తను చాలా పవర్ ఫుల్ కాబట్టి.. మీకు కూడా అలా ఏమన్నా ఉందా..?
పవన్ కళ్యాణ్ : నా దారి నాకు ఉంది.. అంతేకాదు నా లిమిటేషన్స్ నాకు తెలుసు. నాకు చెప్పడానికి ముందుకు రాకపోయినా నాకు నేనుగా కొన్ని విషయాలను నేర్చుకుంటా..
అనుపమ : మీరు నేర్చుకుంటారా..
పవన్ కళ్యాణ్ : అవును.. నేను నేర్చుకుంటా..
అనుపమ : మీకు ఎలా అనిపిస్తుంది మీరు పవర్ ఫుల్ హీరోగా.. అనుకోకుండా కొన్ని బౌండరీస్ ఉంటాయి.. వాటి గురించి మీరు ఎలా ఫీల్ అవుతారు..?
పవన్ కళ్యాణ్ : ఓ చిన్న ఉదాహరణ.. నా థర్డ్ ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడు సక్సెస్ మీట్ కు వెళ్తే.. ఓ అభిమాని ఓపెన్ టాప్ జీప్ తెచ్చాడు.. ఇక సక్సెస్ మీట్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. నాకు ఆ క్షణం నాకు వారికి తేడా ఏంటి అని అనిపించింది. అవకాశం వచ్చింది కాబట్టి తాను ఇక్కడ ఉన్నానని.. అక్కడ చాలా మందిలో కూడా టాలెంట్ ఉండే ఉంటుంది.. ఈ క్రేజ్ ను తలకెక్కించుకోకూడదు..
అనుపమ : మీ జీవితంలో ఎన్నో కోణాలున్నాయి.. పర్సనల్, సినిమాలు, పొలిటికల్ పార్టీ, వీటన్నిటిని ఎలా మీరు బాలన్స్ చేయలుగుతారు..
పవన్ కళ్యాణ్ : నాకంటూ కొన్ని పర్సనల్ ఒపీనియన్స్ ఉన్నాయి.. అవి ఇప్పటినుండే కాదు చాలా రోజుల నుండి ఉన్నవే.. అందుకే నేను ఫియర్ లేకుండా ఉన్నాను…
అనుపమ : మీలో ఉన్న కరేజ్ గురించి
పవన్ కళ్యాణ్ : కరేజ్ గురించి చెప్పాలంటే.. అది పర్టిక్యులర్ గా ఉండదు.. ప్రాబ్లెం వచ్చినప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఉండటమే కరేజ్.. వాటిని ఎదుర్కోవడమే కరేజ్. ఒక లెవల్లో ఉన్న కరేజ్ మరో లెవల్ కు చేరుకుంటుంది.. అది పరిస్తితుతుల ప్రభావాన్ని బట్టి మారుతుంది.
అనుపమ : మీరు జీవితంలో రిస్క్ తెసుకుంటున్నారు అని ఫీల్ అవలేదా
పవన్ కళ్యాణ్ : రిస్క్ అనేది జీవితంలోనే ఉంటుంది.. హార్స్ రైడ్ చేసేప్పుడు కూడా రిస్క్ ఉంటుంది.. చేసేది చేస్తూనే పోవాలి.
అనుపమ : మన దేశంలో ఫిల్మ్ స్టార్స్ కు కొంత ఇబ్బంది ఉంది. అందరి కన్ను వారి మీదే ఉంటుంది. చాలా ఇబ్బందుల్లో వారిని నెట్టేస్తుంటారు..అపజయాలు ఎదురవుతుంటాయి.. దాని గురించి ఎప్పుడు భయపడలేదా..?
పవన్ కళ్యాణ్ : సినిమాలు అనేవి జీవితం కాదు.. లైఫ్ లో మూవీస్ అనేవి పార్ట్ మాత్రమే.. జీవితం అనేది సినిమా కన్నా చాలా పెద్దది..నేను చేసిన ఏవైనా పనులైనా సరే అవి అవతల వారిని అర్ధం చేసుకుని వారు అర్ధం చేసుకునేలా చేసినవే..
అనుపమ : అభిమానులంతా పవనిజం అంటారు..?
పవన్ కళ్యాణ్ : నాకు తెలియదు అసలు పవనిజం ఎలా వచ్చిందో.. ఎక్కడ నుండి వచ్చిందో..
అనుపమ : మీ లైఫ్ లో ఎన్ని పవర్ ఫుల్ సక్సెస్ లు ఉన్నాయో.. అంతే ఫెయిల్యూర్ ఉన్నాయి.. ఖుషి తర్వాత మీరు పది సంవత్సరాలు సక్సెస్ కోసం వెయిట్ చేసారు.. మీరు దాన్ని ఎలా ఫీల్ అయ్యారు..?
పవన్ కళ్యాణ్ : నేను సినిమాల్లోకి రాకముందు.. యక్సిడెంటల్ గా సినిమాల్లోకి వచ్చాక.. నేను సినిమాకు ఎంత బెస్ట్ ఇచ్చాను అని ఆలోచిస్తా.. నేను అమ్మకి చెబుతుంటాను.. నాకు డబ్బులు ఇస్తున్నారు.. నేను వారు అడిగింది చేసేస్తున్నాను అని.. ఇక కెరియర్ లో సక్సెస్ లను అసలు పట్టిచుకోను.. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తే.. ఫ్లాప్ వస్తే బాధపడాలి. అందుకే ఎప్పుడు అలా చేయను.
అనుపమ : మీకు డైరక్షన్ చేసే ఆలోచన ఉందా..?
పవన్ కళ్యాణ్ : లేదు మంచి టాలెంటెడ్ డైరక్టర్ ఉన్నారు.. అవసరమైతే రచయితగా ఉంటాను..
అనుపమ : కాని మిమ్మల్ని కాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా.. (నవ్వుతూ)
అనుపమ : మీకు ఎప్పుడైనా యంగర్ హీరో ఫిలిమ్స్ వస్తున్నాయి.. మీ ఫిల్మ్స్ వస్తున్నాయి.. అనే భావన కలిగిందా..?
పవన్ కళ్యాణ్ : నాకేం కావాలో నాకు తెలుసు.. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారు. అంతేకాదు కాంపిటీషన్ ఉన్నందుకు సంతోషం.
అనుపమ : సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత మీ ప్లాన్స్ ఏంటి.. ?
పవన్ కళ్యాణ్ : నా జీవితంలో నాకు నేను సస్టైన్ అవ్వడం నేర్చుకున్నాను.. అది పర్సనల్ గానా ప్రొఫెషనల్ గా అయినా సరే.. ఇక కేవలం రెండు మూడు సినిమాలను మాత్రమే చేస్తాను.. ఆ తర్వాత సినిమాలు చేయను..
అనుపమ : సినిమాలు చేయరా.. ఎందుకు..?
పవన్ కళ్యాణ్ : నేను పాలిటిక్స్ లోకి వెళ్తే ఇక పూర్తిగా దాని మీద ఉండాలనుకుంటున్నాను.
అనుపమ : మరి పవనిజం పేరుతో ఉన్న అభిమానులు ఏం చేస్తారు..?
పవన్ కళ్యాణ్ : ఓహ్ నాకు తెలియదు.. రాజకీయాల్లోకి రావాలని ఇప్పటినుండి అనుకుంటుంది కాదు కొన్ని సోషల్ బుక్స్ చదవడం వల్ల ఇలాంటి డెశిషన్ తీసుకోవడం జరిగింది.
అనుపమ : తెలుగు సినిమా పాటిస్తున్న సూత్రాలను మీరు పాటించాలనుకుంటున్నరా..
పవన్ కళ్యాణ్ : భారదేశంలో సినిమా తీయడం కాస్త ప్రయాసతో కూడుకున్నది. నవరసాలను పలికించడం కొంచం కష్టతరమే.. కొన్ని హాలీవుడ్ సినిమాలు చూస్తున్నప్పుడు వారి థాట్ ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది.
అనుపమ : కాని మీరు ప్రయత్నించొచ్చు కదా అలాంటివి..?
పవన్ కళ్యాణ్ : అది చాలా కష్టం.. అది తప్పనిసరి అయితే అలా చేయడం జరుగుతుంది.
అనుపమ : ఆ సినిమా చాల్ టైం పడుతుంది కదా
పవన్ కళ్యాణ్ : అవును అలాంటి సినిమాలు చెయాలంటే మేకప్ కే ఎక్కువ టైం పడుతుంది..
అనుపమ : మీరు సినిమాలు చేయనప్పుడు ఏం చేస్తారు..
పవన్ కళ్యాణ్ : బ్రిటిష్ బుక్స్ చదుతుంటాను.. వివిధ రకాల రాజకీయ విశ్లేషణను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను..
అనుపమ : సినిమాల్లో మీకంటూ ఓ గుర్తింపు ఉంది.. మరి రాజకీయాల్లో ఎలా చేంజ్ చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ : నేను ముఖ్యంగా లాండ్ ఆర్డర్, అగ్రికలర్చర్ గురించి ఆలోచిస్తాను.. అంతేకాదు నేను ఏం చేసినా నా స్పృహతో అభివృద్ధికి చేస్తాను.
అనుపమ : మీరు సినిమాలు ఆపేస్తే ఎలా.. మరి..?
పవన్ కళ్యాణ్ : పూర్తిగా కాదు.. సినిమాలు చేయకపోయినా.. రచయితగా కొనసాగుతా..
అనుపమ : లెగసీ గురించి మీరు ఏమంటారు..
పవన్ కళ్యాణ్ : లెగసీ అనేది ఏం లేదు.. నీ డ్యూటీ నువ్ సిన్సియర్ గా చేస్తే ఫలితం అదే వస్తుంది.. ఉదాహరణకు పవనిజం అన్న విషయానికే వస్తే అది అవసరమా అని ఆలోచిస్తాను.. అయితే అది నా అభిప్రాయం మాత్రమే వారిని నేను కాదనలేను. ఈ ప్రపంచంలో లెగెసీ వల్లే అసలు ప్రాబ్లెం.. అన్ రిజర్వెడ్ పీపుల్స్ కూడా లెగసీ ఫీల్లో ఉన్నారు.
అనుపమ : మీరు బ్రాండ్ ఎండార్స్ మెంట్ బిజినెస్ ఎందుకు చేయరు..?
పవన్ కళ్యాణ్ : నాకు అది సూట్ అవదు
అనుపమ : ఎందుకని..?
పవన్ కళ్యాణ్ : నా ప్రాడెక్ట్ ను నేను వాడుతా కాబట్టి దాన్ని నేను నమ్ముతాను ప్రేమిస్తాను.. కాని ఇంజస్టీస్ గా నేను బ్రాండింగ్ చేయను.. అది నాకు నచ్చదు.
అనుపమ : కాని అవి చేయడం వల్ల మంచ్ ఫ్యాన్సీ అమౌంట్ వస్తుంది కదా..
పవన్ కళ్యాణ్ : హా. అవును నేను ఆ ఫీలింగ్ లో ఉండే వాడిని.. సరే చేద్దాం అనుకునే టైం కు మళ్లీ నా ఆలోచనలు నన్ను వెనక్కి నెట్టేస్తాయి.
అంతేకాదు ఆ యాక్టర్స్ ను చూస్తుంటే నాకు జలసీ వసుతుంది (నవ్వుతూ)
అనుపమ : థాంక్ యు సో మచ్..