తెలంగాణ రాజకీయాల్లో పవర్ వార్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల కరెంట్ వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఎక్కడికో వెళ్తోంది. అయితే ఇక్కడ అసలు పాయింట్ ను కాంగ్రెస్ లేవనెత్తింది. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ను పట్టుకోవడంలో .. బీఆర్ఎస్ విఫలమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పవర్ వార్ లో బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహం ఉంది. కానీ మూస ఎదురుదాడితో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నారు.
ఎనిమిది గంటల విద్యుత్ ఉంటేనే రైతులకు మూడు పంటలకు సరిపడా నీరు వస్తుందని ఇదే రేవంత్ రెడ్డి చెప్పారు. దానిపైనే వివాదం. మరి పదకొండు గంటల కరెంట్ తెలంగాణ సర్కార్ ఇస్తోందని ఆ పార్టీనే లాగ్ బుక్‌లను తెచ్చి మరీ సర్టిఫికెట్ చేస్తోంది. ఎనిమిది గంటలు చాలన్న నేతే పదకొండు గంటల కరెంట్ వస్తోందని చెబుతున్నారంటే… ఎంత అడ్వాంటేజ్‌గా తీసుకోవాలన్నది బీఆర్ఎస్ ప్రణాళిక రచించుకోవాల్సి ఉంది. కానీ … ఇరవై నాలుగు గంటంలసరఫరాను హైలెట్ చేస్తోంది. కానీ.. ఈ టాపిక్ ను అందుకోలేకపోతోంది.
ఇళ్లకూ ఇరవై నాలుగు గంటల కరెంట్ సరఫరా చేస్తారు. కానీ అవసరం ఉన్నంత వాడుకుంటారు. రైతులకూ అంతేనని… పదకొండు గంటలకరెంట్ ఇవ్వడం చిన్న విషయం కాదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ… కరెంట్ అసలివ్వడం లేదన్నట్లుగా కాంగ్రెస్ ప్రచారాన్ని బీఆర్ఎస్ తిప్పి కొట్టలేకపోతోంది. రైతులతో సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్నారు కానీ.. రైతులకు అవసరమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పుకోలేకపోతున్నారు.