పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో.. నిండా మునిగిపోయాక.. ఇప్పుడు.. బయటకు ఎలా తేలాలా.. అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా…. పీపీఏలను రద్దు చేయబోవడం లేదనే ఓ ప్రకటనను.. జాతీయ మీడియాకు.. ఏపీ సర్కార్ పంపింది. ముఖ్యంగా.. బీజినెస్ వెబ్ సైట్లు.. ఇతర వ్యాపార పరమైన వార్తలు కవర్ చేసే మీడియా సంస్థలకు.. ఆ వివరణను పంపి.. ప్రముఖంగా.. వార్త వచ్చేలా చూడాలని.. సర్కార్ పెద్దలు కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది.
పీపీఏను సమీక్షల కమిటీ రద్దు చేయదన్న ఏపీ సర్కార్..!
ఏపీ సర్కార్… జాతీయ మీడియాకు పంపిన సమాచారం ప్రకారం… పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను.. రద్దు చేసే ఉద్దేశంతో.. తాము నియమించిన సమీక్షల కమిటీకి లేదని… ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం కంపెనీలతో సంప్రదింపులు మాత్రమే జరుపుతుందని చెప్పుకొచ్చింది. కానీ.. హైకోర్టు సస్పెండ్ చేసిన జీవో ప్రకారం.. విద్యుత్ రంగంలోని పీపీఏలన్నింటినీ.. సమీక్షించి.. ఎక్కువగా చెల్లించినట్లు భావిస్తున్న నిధులను రికవరీ చేయాలని.. లేకపోతే.. పీపీఏలను రద్దు చేయాలని.. ఆ కమిటీకి అధికారం ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధమని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. విద్యుత్ కంపెనీలు పవర్ ట్రిబ్యునల్‌కు వెళ్లాయి. కోర్టులోనూ పిటిషన్లు వేశాయి. అదే సమయంలో.. కేంద్రానికీ ఫిర్యాదులు చేశాయి.
నిండా మునిగిన తర్వాత బయట పడే ప్రయత్నమా..?
ధరలు తగ్గించమని.. బెదిరిస్తున్నారని… విద్యుత్ కంపెనీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడం… వ్యాపారవర్గాల్లో కలకలం రేపుతోంది. చివరికి ఈ జీవోను… హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేయడం.. ఆ తర్వాత కూడా.. ఇమేజ్ డామేజ్ అయ్యే నిర్ణయమే వస్తుంది కానీ.. పీపీఏలపై సమీక్ష.. ఏ విధంగానూ చట్టబద్ధం కాదని న్యాయనిపుణుల అభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. ఏపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా.. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. కేంద్రం రెండు సార్లు లేఖలు రాసి హెచ్చరించినంత పని చేసింది. అయినా… ధరలు తగ్గించకపోతే పీపీఏలను రద్దు చేస్తామనే హెచ్చరికలను ఏ మాత్రం ఆపని… సమీక్షా కమిటీ… ఒక్క సారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. హైకోర్టు కమిటీ జీవోను.. సమీక్షలకు రావాలనే ఆదేశాల లేఖలను కూడా సస్పెండ్ చేయడంతో.. ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించకపోతే.. మొదటికే మోసం వస్తుందని.. ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తున్నారని.. అందుకే పీపీఏలను రద్దు చేసే ఉద్దేశమే లేదని.. జాతీయ మీడియాకు సమాచారం పంపుతున్నారని చెబుతున్నారు.
ఈఆర్సీ గురించి ఏపీ సర్కార్‌కు ఇప్పుడే తెలిసిందా..?
అయితే.. తాము పీపీఏలను రద్దు చేయబోం కానీ… తమ వాదనను.. ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ టారిఫ్‌లు మొత్తం ఈఆర్సీ చేతుల్లో ఉంటాయని తెలియకుండానే.. ఏపీ సర్కార్.. ఇంత వరకూ ఎలా నిర్ణయాలు తీసుకుందన్న చర్చ.. ఇప్పుడు.. విద్యుత్ రంగ నిపుణుల్లో ప్రారంభమైంది. ఏది ఏమైనా… పీపీఏల వివాదంలో ఇరుక్కుపోయిన … వైసీపీ బయటకు వచ్చేందుకు ..గడ్డిపోచను పట్టుకుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.