ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ పోలీసు అధికారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియా రాకుండా ఉండటానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య పెట్టుబడి పెడితే వచ్చే గ్రీన్ కార్డు కోసం ఆయన ప్రయత్నించారని తెచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది. తాజాగా ఆయన తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ ఆలోచన ఎలా వచ్చిందో కానీ ఆయన దరఖాస్తు పెట్టేసుకున్నారు.
రాజకీయ శరణార్థులు అంటే కేసుల్లో ఇరుక్కున్న వారు కాదు. దానికో స్టాండర్డ్ ఉంటుంది. కానీ ఈ ప్రభాకర్ రావు అసలు రాజకీయాల్లో లేరు. ఉద్యోగంలో తప్పుడు పనులు చేశారు. మరి ఏ కోణంలో ఆయనకు శరణార్థిగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరాలన్న ఆలోచన ఆయనకు వచ్చిందోనన్న చర్చ జరుగుతోంది. ఆయన వస్తే చాలా మంది ప్రముఖులు జైలుకు పోవాల్సి వస్తుందన్న ప్రచారం ఉంది. అందుకే వారే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయనను అమెరికాలో ఉంచేందుకు ఎంత ఖర్చు అయినా పెడుతున్నారని అంటున్నారు.
నిజానికి కేసులు నమోదైన తర్వాత ఓ సారి ప్రభాకర్ రెడ్డి లొంగిపోవడానికి వచ్చేస్తున్నారని చెప్పుకున్నారు. కానీ ఆయన మల్లీ దుబాయ్ నుంచి వెనక్కి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. మొదట్లో పోలీసులతో పాటు కోర్టుకూ తన తరపున లాయర్లను పంపి వివరణ ఇచ్చేవారు. ఆరు నెలల్లో వస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ రాలేదు. అంటే.. ఆయన విషయంలో ఓ పెద్ద నెట్ వర్క్ ప్రభుత్వానికి చిక్కకుండా జాగ్రత్త పడుతోందని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.