ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేయేడంలో జేసీ బ్రదర్స్ తమదైన శైలి చూపిస్తారు. తాజాగా జగన్ ను ఆయన తల్లిదండ్రులు ఎలా పెంచారన్నదానిపై సెటైరిక్ కామెంట్లు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ విషయంలో ఆయన ఎక్కడా లైన్ క్రాస్ చేయలేదు. జగన్ కేబినెట్లోని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకు ముడిపెట్టే ఇలా మాట్లాడారు. ఏపీలో నేరాలు పెరిగిపోతూండటంపై పిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జగన్కు అన్వయించి అర్థం చెప్పేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
మా రాజశేఖర్ రెడ్డిని ఏమీ అనవద్దు అంటూ హోంమంత్రి వనితకు జేసీ ప్రభాకర్ రెడ్డిసలహా ఇచ్చారు., ఎందుకంటే కూడా కారణం చెప్పారు. ” ఆయన్ను తల్లి సరిగ్గా పెంచలేదని ఓ మహాతల్లి చెప్పింది. ఆమె చెప్పింది కరెక్టే.. ఈయన్ని పెంచడం మా రాజశేఖరరెడ్డికి కష్టం అయ్యింది. వాళ్ల అమ్మ పెంపకం మంచిదే.. కానీ అప్పటికే డైవర్ట్ అయ్యి వాళ్ల తాత రాజారెడ్డి దగ్గరికి ఆయన వెళ్లాడు. తాత రాజారెడ్డి పెంచడంతో సేమ్ టు సేమ్ రాజారెడ్డిలాగే తయారయ్యాడు. మా రాజశేఖరరెడ్డిని ఏమీ అనొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
జేసీ కోపానికి కారణం ఏమిటంటే… ఎప్పుడో నాలుగేళ్ల కిందట జరిగిన ప్రబోధానంద ఆశ్రమం ఘర్షణలో ఇప్పుడు కొత్తగా అరెస్టులు చేస్తున్నారట. కొత్తగా ముఫ్పై ఆరు మంది మున్లిం వ్యక్తులపై కేసులు పెట్టారని ఇది దారుణమని మండిపడ్డారు. ఇదంతా సజ్జల చేయిస్తున్నారని.. ఆయన ఎప్పుడో ఓ సారి దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.