ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో ‘రాజాసాబ్’ ఒకటి. ఏప్రిల్ 10న విడుదల అవుతోంది. మారుతి దర్శకుడు. చిత్రీకరణ వేగవంతం చేశారు. జనవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలన్నది టార్గెట్. త్వరలోనే చిత్రబృందం యూరప్ వెళ్లనుంది. అక్కడ ప్రభాస్ – మాళవికలపై ఓ డ్యూయెట్ చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దాదాపు 5 పాటలుంటాయి. ఒక్కో పాట ఒక్కో తరహాలో సాగబోతోంది. అందమైన మెలోడీ కూడా ఉందని, దాన్ని యూరప్ లో చిత్రీకరిస్తేనే బాగుంటుందని మారుతి డిసైడ్ అయ్యారు.
ఈమధ్య ప్రభాస్ సినిమాల్లో డ్యూయెట్లు కనుమరుగైపోయాయి. ఆయన స్టెప్పులు కూడా వేయడం మానేశారు. ఆ లోటు రాజాసాబ్ లో తీరబోతోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఆముగ్గురితో కలిపి ఓ పాటని డిజైన్ చేశారు మారుతి. అందుకోసం డిస్కో డాన్సర్ లోని ‘నాచే నాచే’ అనే క్లబ్ పాటని రీమిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పాట రీమిక్స్ రైట్స్ కోసం ఇప్పటికే రెండు కోట్లు వెచ్చించారు. ఈ పాటని త్వరలోనే ఓ భారీ సెట్ వేసి చిత్రీకరించబోతున్నారు. జనవరి నుంచి ప్రమోషన్లు కూడా మొదలెడతారు. సంక్రాంతికి ఓ పాటని విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ్నుంచి ప్రతీ పదిహేను రోజులకు ఓసారి ‘రాజాసాబ్’ నుంచి ఏదో ఓ అప్ డేట్ బయటకు వస్తుంది.