మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే షూటింగ్ మొదలెడతారు. ఈ సినిమా కథ, కథనాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదో హారర్ స్టోరీ అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ దెయ్యం ప్రభాసే నట. చంద్రముఖి చూశారు కదా..? ఆ సినిమాపై జ్యోతికపై ఓ ఆత్మ అప్పుడప్పుడూ ఆవహిస్తుంటుంది. సేమ్ అలాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నార్ట. ప్రభాస్ ని అప్పుడప్పుడూ ఓ ఆత్మ ఆవహిస్తుందని, ఆ సమయంలో ప్రభాస్ ప్రవర్తన వింత వింతగా ఉంటుందని, అందులోంచే కామెడీ పుట్టుకొస్తుందని తెలుస్తోంది. ఓ అగ్ర కథానాయకుడు, యాక్షన్ హీరో… అందులోనూ పాన్ ఇండియా స్టార్… ఈ తరహా కాన్సెప్టులో నటించడం కొత్తే. మారుతి బలం… వినోదం. కామెడీని తను బాగా పండిస్తాడు. ప్రభాస్ తో పాటు.. చుట్టు పక్కల క్యారెక్టర్లు కూడా కొత్తగా డిజైన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో… నిధుల అన్వేషణ అనే సబ్ లేయర్ కూడా మారుతి తెలివిగా జోడించాడని, అందుకే ఈ కథలో హారర్ తో పాటుగా థ్రిల్లర్ లక్షణాలూ కనిపిస్తాయని తెలుస్తోంది. ప్రభాస్ తాత పాత్ర ఈ సినిమాలో కీలకం. ఆ పాత్ర కోసం బొమన్ ఇరానీ పేరు పరిశీలిస్తున్నారు. కీలకమైన ప్రతినాయుడి కోసం సంజయ్ దత్‌ని సంప్రదించినట్టు సమాచారం.