ప్ర‌భాస్ వ‌చ్చేశాడు… వాట్ నెక్ట్స్?

‘క‌ల్కి’తో త‌న ఖాతాలో మ‌రో రూ.1000 కోట్ల సినిమా వేసుకొన్నాడు ప్ర‌భాస్‌. ‘క‌ల్కి’ విడుద‌ల‌కు ముందే ఇట‌లీ వెళ్లిపోయాడు ప్ర‌భాస్‌. అక్క‌డ రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకొన్నాడు. ఇప్పుడు హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశాడు. ఇప్పుడు ప్ర‌భాస్ త‌దుప‌రి అడుగు ఎటువైపు అన్న‌దే ప్ర‌శ్న‌.

Read More : ఎక్స్‌క్లూజీవ్‌: ప్ర‌భాస్ టైటిల్ ‘ఫౌజీ’

ప్ర‌భాస్ రాక‌కోస‌మే ‘రాజా సాబ్‌’ ఎదురు చూస్తోంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తున్న సినిమా ఇది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భాస్ ఈ సినిమాకు ఇచ్చింది త‌క్కువ కాల్షీట్లే. ప్ర‌భాస్ తో అవ‌స‌రం లేని స‌న్నివేశాల్ని పూర్తి చేసుకొంటూ వ‌చ్చాడు మారుతి. ఇప్పుడు ప్ర‌భాస్ వ‌స్తే త‌ప్ప‌, షూటింగ్ ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. మొత్తానికి ‘క‌ల్కి’ త‌ర‌వాత ప్ర‌భాస్ కూడా ఖాళీ. ఎందుకంటే ‘క‌ల్కి 2’ మొద‌ల‌వ్వ‌డానికి టైమ్ ప‌డుతుంది. మ‌రోవైపు హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి స‌మ‌యం ఉంది. ఈలోగా ‘రాజాసాబ్‌’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. ఈనెలాఖ‌రు నుంచి ‘రాజాసాబ్‌’ కొత్త షెడ్యూల్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా ప్ర‌భాస్ ఇచ్చే డేట్ల‌పై ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌భాస్ ఎప్ప‌టి నుంచి అందుబాటులో ఉంటాడు? అనేదాన్ని బ‌ట్టే రాజాసాబ్ షూటింగ్ ఎప్పుడ‌నేది తేలుతుంది. 2025 ప్ర‌ధ‌మార్థంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాలి. అలా జ‌ర‌గాలంటే ప్ర‌భాస్ క‌నీసం రెండు నెల‌ల పాటు ఏక ధాటిగా డేట్లు ఇచ్చి ఈ సినిమాని పూర్తి చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close