తెలుగు హీరో నుంచివ పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. ప్రభాస్ క్యాలిబర్‌కీ, స్టామినాకీ ‘కల్కి’ ఓ నిదర్శనంలా మారింది. ఈ సినిమా రూ.1000 కోట్ల మైలు రాయికి చేరువలో ఉంది. త్వరలోనే ఆ మైల్ స్టోన్ అందుకోవడం ఖాయం. ఈ హిట్ తో ప్రభాస్ పారితోషికం కూడా పెరిగింది. మొన్నటి వరకూ ప్రభాస్ రూ.150 కోట్ల హీరో. ఇప్పుడు తాజాగా రూ.200 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. అదే నిజమైతే సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకొనే స్టార్ గా ప్రభాస్ నిలుస్తాడు.
విజయ్ ‘గోట్’ కోసం రూ.180 కోట్ల వరకూ అందుకొన్నాడని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం విజయ్ పారితోషికం రూ.120 నుంచి రూ.140 కోట్ల లోపే. ‘గోట్’ తరవాత విజయ్ రాజకీయాల్లో బిజీ అవుతాడు. ఆ తరవాత సినిమాలు చేస్తాడో లేదో తెలీదు. ఓ రకంగా విజయ్ చివరి సినిమా ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ పారితోషికం అమాంతంగా రూ.180 కోట్లకు చేరుకొంది. ప్రభాస్ ఇప్పుడు అంతకంటే ఎక్కువ తీసుకొంటున్నాడు. ప్రభాస్ సినిమాకు ఆ స్టామినా ఉంది. తనతో సినిమా అంటే… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపుగా రూ.350 కోట్ల వరకూ వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రభాస్‌కు ఈ స్థాయిలో ఇవ్వడంలో నిర్మాతలకూ ఇబ్బంది ఉండకపోవొచ్చు. ప్రస్తుతం ‘రాజాసాబ్’లో నటిస్తున్నాడు ప్రభాస్. ఆ తరవాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా అక్టోబరులో పట్టాలెక్కనుంది. ‘స్పిరిట్’ కూడా సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. వీటికి సంబంధించిన పారితోషికాలు ముందే ఓకే అయిపోయాయి. వీటి తరవాత ఒప్పుకొనే సినిమాకు రూ.200 కోట్లు ఇవ్వాల్సిందే.