ప్రభాస్ మరోసారి పెద్ద మనసు చూపించాడు. ఇప్పటికే కేంద్రానికి మూడు కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలకూ కలిపి కోటి రూపాయల సహాయం అందించిన ప్రభాస్.. ఇప్పుడు మరో రూ.50 లక్షలు ప్రకటించాడు. ఈ మొత్తాన్ని సీసీసీ (కరోనా క్రైసెస్ ఛారిటీ) కోసం వెచ్చించాడు. చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఏర్పాటు అయిన సంగతీ, ఈ సంస్థ పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు, వైద్య సదుపాయాలు అందించనున్న విషయం తెలిసినదే. ఇప్పటికే చాలామంది హీరోలు, సాంకేతిక నిపుణులు సీసీసీ ద్వారా సహాయం అందించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ తన వంతుగా రూ.50 లక్షలు ప్రకటించాడు.
మొత్తంగా చూస్తే ప్రభాస్ నుంచి ఇప్పటి వరకూ రూ.4.5 కోట్ల వితరణ లభించినట్టు. టాలీవుడ్ లో ఏ ఇతర కథానాయకుడూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం అందించలేదు.