కమర్షియల్ సినిమాల పంథా వేరు. హీరో ఎంత త్వరగా ఎంట్రీ ఇస్తే… ఫ్యాన్స్కి అంత ఖుషి. అసలు ఫ్యాన్స్ ఎదురు చూసేదే.. హీరో ఎప్పుడొస్తాడా అని. అందుకే… హీరోని వీలైనంత త్వరగా చూపించడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. అయితే.. `సలార్` లో మాత్రం ప్రభాస్ ఎంట్రీ ఆలస్యం అవ్వబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా మొదలైన 20 నిమిషాల వరకూ ప్రభాస్ కనిపించనే కనిపించడని టాక్. తొలి పది నిమిషాలూ చైల్డ్ ఎపిసోడ్ తో నడిపించేశార్ట. మిగిలిన పది నిమిషాలూ బిల్డప్ సీన్లతో సరిపెట్టార్ట. ఆ తరవాతే ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేది.
ప్రశాంత్ నీల్ తెలివిగా ఈ విషయాన్ని ట్రైలర్లోనే చెప్పేశాడు. ట్రైలర్ లో కూడా అంతే. సగం ట్రైలర్ అయ్యేంత వరకూ ప్రభాస్ కనిపించనే కనిపించడు. సేమ్ అదే ట్రీట్ మెంట్ సినిమాలోనూ ఫాలో అయ్యాడన్నమాట. ఏ సినిమా అయినా, తొలి పావు గంటలో కథేంటో చూచాయిగా చెప్పేయాలన్నది ఓ రూల్. రాజమౌళి లాంటి దర్శకులు దాన్ని ఫాలో అవుతుంటారు. కానీ సలార్ లో మాత్రం హీరో 20వ నిమిషం తరవాత ఎంట్రీ ఇస్తున్నాడు. సలార్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పూర్తిగా పరిచయం చేశాక గానీ, హీరోని రంగంలోకి దింపడం లేదు ప్రశాంత్ నీల్. సలార్ దాదాపుగా మూడు గంటల సినిమా కాబట్టి, దర్శకుడు ఆ మాత్రం టైమ్ తీసుకోవడంలో తప్పేం లేదేమో..?