యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తెలుగు రెండు రాష్ట్రాల్లో సంబరాలు జరుపుకున్నారు. ఇక మదనపల్లి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రికార్డు స్థాయిలో ప్రభాస్ పెయింట్ తో అదరహో అనిపించారు. 100 అడుగులు ఎత్తు 60 అడుగుల వెడల్పుతో బాహుబలి ప్రభాస్ పెయింటింగ్ నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విశెష్ తెలుపుతూ వేయించారు. ఈ రెంజ్ లో పెయింటింగ్ వేయడం ఇదే మొదటిసారి కావొచ్చు. బాహుబలితో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ప్రభాస్ ప్రతి ఒక్క తన అభిమానిని గర్వపడేలా చేశాడు.
ప్రస్తుతం బాహుబలి-2 కి సిద్ధమవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇచ్చిన ఈ గిఫ్ట్ కి చాలా సంతోష పడ్డాడు. మిగతా హీరోల ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ ఫ్యాన్స్ తక్కువోళ్లేం కాదు కాస్త కూస్తో ఎక్కువే అన్నట్టు నిరూపించారు ఈ పెయింటింగ్ తో.. ఇక నిన్న జరిగిన ప్రభాస్ బర్త్ డే కార్యక్రమాల్లో అవంతిక తమన్నా కూడా పాల్గొన్నట్టు సమాచారం.
బాహుబలి సెకండ్ పార్ట్ కి సిద్దమవుతున్న ప్రభాస్ అందులో కూడా తన ఖలేజా చూపించి ఈసారి తన నెవరు టచ్ చేయడానికి కూడా సాహసించని రేంజ్లో హిట్ కొట్టాలని.. కొడతాడని.. ఆశిద్దాం.