తమిళ హీరో అంటే తమిళ హీరో కాదులెండి! మన తెలుగు హీరో కూడానూ! ‘బొమ్మరిల్లు’కి ముందు తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’, ఆ తరవాత ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’తో పాటు పలు హిట్స్‌లో నటించాడు. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఇతగాడికి సోమవారం ట్విట్టర్లో అభిమానులు సెగ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సినిమా విడుదలకు ముందు ‘వన్‌వీక్ టు గో’ అని, స్టార్స్ బర్త్‌డేలకు ముందు ‘50డేస్ టు గో, 100డేస్ టు గో’ అని ట్రెండింగ్ చేస్తారు.
సోమవారం అలాగే ‘‘100డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్‌డే’ అని ట్రెండ్ చేశారు. దీనిపై సిద్ధార్ధ్ సెటైర్ వేశాడు. ‘‘465 డేస్ టు కింగ్ ప్రభాస్ నెక్ట్స్ బర్త్‌డే ఆఫ్టర్ థిస్ వన్. ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ థ్రిల్ ఇస్తుంది. కానీ, చంపేస్తుంది. దయచేసి వాటికి కాస్త విచక్షణతో ఉపయోగించండి’’ అని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. దాంతో ప్రభాస్ అభిమానులు అతడిపై ట్విట్టర్ దాడి చేయడం మొదలు పెట్టారు.
‘‘రజనీకాంత్, అజిత్, విజయ్ బర్త్‌డే ట్రెండ్స్ గురించి ఇలాగే ట్వీట్ చేయగలవా? నెక్ట్స్ మినిట్ ట్విట్టర్ నుంచి వెళ్లిపోతావ్’’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా… ‘‘రోజు రోజుకీ హ్యాష్‌ట్యాగ్ అనేది జోక్‌గా మారింది. జోకులు చూసి జనాలు నవ్వుతారనుకుంటున్నా. ట్విట్టర్ నుంచి ఎవరూ వెళ్లిపోవలసిన అవసరం లేదు’’ అని సిద్ధార్థ్ రిప్లై ఇచ్చారు.
ఇంకో అభిమాని ఏదో సినిమా ఫంక్షన్లో ప్రభాస్, సిద్ధార్థ్ పక్క పక్కన కూర్చుని నవ్వుతున్న ఫొటో పోస్ట్ చేసి ‘‘ఎందుకు భయ్యా నీ ఫ్రెండే కదా!’’ అని అడిగాడు. ‘‘ఫ్రెండ్ కాబట్టి ఫ్రీడమ్ తీసుకుంటున్నా’’ అన్నాడు సిద్ధార్థ్. ఇంతకంటే ఘోరంమైన కామెంట్స్‌తో కొంతమంది సిద్ధార్థ్‌ని ఆట ఆడుకున్నారు. ఇద్దరు ముగ్గురికి సిద్ధార్థ్ గట్టిగా క్లాస్ తీసుకున్నాడు. ప్రజలు చాలా సమస్యల గురించి సీరియస్ కావాలి గానీ… జోకుల గురించి కాదన్నాడు.